‘ఏబిసిడి’ చేయమని రామ్‌చరణ్ చెప్పాడు

  అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఏబిసిడి’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని కలిసి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌తో ఇంటర్వూ విశేషాలు… విభిన్నమైన భావోద్వేగాలు… రెండేళ్ల క్రితం ‘ఏబిసిడి’ ఒరిజినల్ వర్షన్ చూశాను. దాన్ని తెలుగుకు తగ్గట్టు చాలా మార్చాం. ఇందులో డ్రామాతో పాటు విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమా గ్రాఫ్ నాకు […] The post ‘ఏబిసిడి’ చేయమని రామ్‌చరణ్ చెప్పాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఏబిసిడి’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని కలిసి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌తో ఇంటర్వూ విశేషాలు…

విభిన్నమైన భావోద్వేగాలు…
రెండేళ్ల క్రితం ‘ఏబిసిడి’ ఒరిజినల్ వర్షన్ చూశాను. దాన్ని తెలుగుకు తగ్గట్టు చాలా మార్చాం. ఇందులో డ్రామాతో పాటు విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమా గ్రాఫ్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేయమని రామ్‌చరణ్ నాకు చెప్పాడు. ఆ తర్వాత మారుతి, వరుణ్ అందరూ చెప్పారు. ఇక ‘ఏబిసిడి’ ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగా వచ్చింది.

దాంతో పోలిక ఉండదు…
ఈ సినిమా థీమ్‌ను వదిలిస్తే ‘పిల్ల జమీందారు’కు, దీనికీ పెద్దగా పోలిక ఉండదు. అమెరికాలో ఉండి గారాబంగా పెరిగిన అబ్బాయిని తండ్రి ఇండియాకు తరిమేస్తే… అక్కడ అతను జీవితం విలువను ఎలా తెలుసుకున్నాడనేది ఈ సినిమా కథాంశం. తండ్రి, కొడుకు కథ నేపథ్యంలో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

ఆనందంగా అనిపించింది…
ముందుగా ఒరిజినల్ వర్షన్ సినిమా చూసినప్పుడే నాకు నచ్చింది. కాకపోతే నాకు నచ్చిందని, ఆ స్క్రిప్ట్‌తో సినిమా చేయమని నేను అడగలేదు. అయితే ఈ చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆతర్వాత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

కథలో భాగంగా పొలిటికల్ డ్రామా…
ఇది పూర్తిగా పొలిటికల్ డ్రామా కాదు. కానీ కథలో భాగంగా కాస్త పొలిటికల్ డ్రామా ఉంటుంది. మన ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. ‘ఏబిసిడి’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

నిరాశపరచడంతో బాధపడ్డా…
‘ఒక్క క్షణం’ సినిమా నిరాశపరచడంతో బాధపడ్డాను. ఆ సినిమా కోసం ఏడాది సమయాన్ని వెచ్చించా. అంత కష్టాన్ని ప్రేక్షకులు ఒప్పుకోనప్పుడు కాస్త బాధగా అనిపించింది. అయితే ఓవర్సీస్‌లో ఆ సినిమా ఇండియాకన్నా బాగా ఆడింది.

అప్పటినుంచి రాణించేందుకు ప్రయత్నించా…
ఇన్నేళ్ల నటన నాకు చాలానే నేర్పింది. కెమెరా అంటే ఉన్న భయాన్ని పోగొట్టింది. అలాగే చాలా మంది సీనియర్లతో పనిచేశాను. వాళ్లు ఎలా సీన్‌లో జీవిస్తారో తెలుసుకున్నా. ‘కొత్తజంట’ సినిమా చేసేటప్పుడు సుకుమార్‌ని ఒకసారి డీసెంట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? అని అడిగాను. అందుకు ఆయన ‘దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు డీసెంట్ ఆర్టిస్ట్’ అని అన్నారు. ‘దర్శకుడు చెప్పిన దానికి తన సొంత విషయాన్ని కలగలపి నటించేవాడు ఎక్స్‌ట్రార్డినరీ ఆర్టిస్ట్’ అని చెప్పారు. అప్పటి నుంచి మంచి నటుడిగా రాణించేందుకు ప్రయత్నించాను.

Allu Sirish And Rukshar ABCD movie release on May 17

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ఏబిసిడి’ చేయమని రామ్‌చరణ్ చెప్పాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: