స్టైలిష్ ఫాల్కన్

Allu-Arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిజంగానే స్టైలిష్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. తాను ఏది చేసినా దానిపై తన మార్క్ వేసుకుంటాడు. ఇప్పుడు తనకోసం దాదాపు ఏడుకోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేకంగా ఒక వ్యానిటీ వ్యాన్ డిజైన్ చేయించుకొని, దానికి ‘ఫాల్కన్’ అని పేరుకూడా పెట్టుకున్నాడు. ఈ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి “నా జీవితంలో ఏది కొన్నా.. నా మైండ్‌కి ఒకే విషయం గుర్తుకొస్తుంది. అభిమానులు నా మీద చూపించిన ప్రేమ కారణంగానే నేను ఇవన్నీ కొనగలుగుతున్నాను. నా మీద ప్రేమ చూపిస్తున్న వారందరికీ నేను రుణపడి ఉంటాను. థాంక్యూ ఆల్ ఇట్స్ మై వ్యానిటీ వ్యాన్‌” అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.

Allu Arjun Stylish Falcon

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్టైలిష్ ఫాల్కన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.