అల్లరి నరేష్ ‘నాంది’టీజర్ విడుదల..

Allari Naresh Nandi movie teaser released

హైదరాబాద్‌ః అల్లరి నరేష్ చాలా గ్యాప్ తర్వాత కథానాయుకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాంది’. నరేష్‌కు ఇది 57వ చిత్రం. రెగ్యూలర్‌గా కామెడీ బేస్ చిత్రాలు చేసే నరేష్ తన పంథా మార్చుకొని తొలిసారి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నాంది’ టీజర్ విడుదలైంది. యంగ్‌స్టార్ విజయ్‌దేవరకొండ ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ‘టీజర్ అద్భతంగా ఉంది. ‘నాంది’ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. టీజర్‌ను అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభనందలు తెలుపుతున్నాను’ అని విజయ్ పేర్కొన్నాడు. కాగా, చిత్రంలో నరేష్‌తోపాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, ప్రవీణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తునారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఎనభైశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

Allari Naresh Nandi movie teaser released

The post అల్లరి నరేష్ ‘నాంది’ టీజర్ విడుదల.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.