పంచాయతీ నిధుల దుర్వినియోగానికి చెక్

  చెల్లింపులన్నీ ఇక ఇన్‌లైన్‌లోనే.. సర్పంచ్‌లకు మింగుడుపడని వైనం.. వరంగల్ రూరల్ : గ్రామపంచాయతీ నిధులను ఇష్టమొచ్చినట్లుగా విడుదల చేసుకొని సొంత ఖర్చులకు వినియోగించుకునేందుకు ఇక వీలుండదు. గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రతిపైసాకు ఆధారాలతో సహా లెక్క ఉండాల్సిందే. పంచాయతీ నిధులను గతంలో సర్పంచ్‌లు ఇబ్బడిముబ్బడిగా, ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీల్లో చేపట్టిన పనులకు చెల్లించాల్సి న బిల్లులు వేతనాల వివరాలను “ఈకుబేర్‌” […] The post పంచాయతీ నిధుల దుర్వినియోగానికి చెక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెల్లింపులన్నీ ఇక ఇన్‌లైన్‌లోనే..
సర్పంచ్‌లకు మింగుడుపడని వైనం..

వరంగల్ రూరల్ : గ్రామపంచాయతీ నిధులను ఇష్టమొచ్చినట్లుగా విడుదల చేసుకొని సొంత ఖర్చులకు వినియోగించుకునేందుకు ఇక వీలుండదు. గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రతిపైసాకు ఆధారాలతో సహా లెక్క ఉండాల్సిందే. పంచాయతీ నిధులను గతంలో సర్పంచ్‌లు ఇబ్బడిముబ్బడిగా, ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది.

పంచాయతీల్లో చేపట్టిన పనులకు చెల్లించాల్సి న బిల్లులు వేతనాల వివరాలను “ఈకుబేర్‌” వెబ్‌సైట్‌లో నమోదు చేస్తేనే బిల్లులు పాస్ చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఏవివరాలు నమోదు చేయకుండా నిధులను డ్రా చేసుకునేందుకు వీల్లేకుండా చేశారు. ఆన్‌లైన్‌లో జనరేట్ అయిన చెక్కులపైనే సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు చేయాల్సి ఉం టుంది. గతంలో పంచాయతీ ఖాతా ఉన్న బ్యాంకు జారీ చేసే చెక్కులపై స ంతకాలు చేసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.

సర్పంచ్‌లకు మింగుడు పడని వైనం..
రూరల్ జిల్లాలో 401 గ్రామపంచాయతీలున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగగా సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సర్పంచ్‌లు వ్యతిరేకించారు. ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడం వల్ల అభివృద్ధి పనులు స్వేచ్ఛగా చేయించలేకపోతామని గ్రామాభివృద్ధికి ఆటంకమేర్పడుతుందని సర్పంచ్‌లు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి పంచాయతీలో సర్పంచ్‌కు ఉపసర్పంచ్‌తో జాయింట్ చెక్‌పవర్ కల్పించారు. జాయింట్ చెక్‌పవర్ నుండి పంచాయతీ కార్యదర్శిని తప్పించడంతో నిధులు పక్కదారి పట్టే అవకాశాలుంటాయని భావించిన ప్రభుత్వం ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని తీసుకురావడంతో సర్పంచ్‌లకు మింగుడుపడనిదిగా మారింది.

ఉదహరణకు రూ.10 వేల విలువచేసే వీధిలైట్లను పెట్టించినట్లయితే బిల్లు డ్రా చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంంటుంది. ఏషాపులో కొనుగోలు చేశారో వివరాలు, ఫోన్‌నెంబర్, జిఎస్‌టి తదితర వివరాలను నమోదు చేసిన తరువాత చెక్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత చెక్ ప్రింట్ తీసుకొని దానిపై సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు చేసిన తరువాత ఆచెక్‌ను పంచాయతీ కార్యదర్శి ఎస్‌టిఒ కార్యాలయానికి పంపిస్తే బిల్లు పాస్ అవుతుంది. అవికూడా ఎవరికైతే బిల్లు చెల్లించాల్సి ఉంటుందో వారి ఖాతాలోనే జమ చస్తారు. అన్ని నగదు రహిత చెల్లింపులే. ఒక వేళ సర్పంచ్, ఉపసర్పంచ్ ఒక్కటై ఆన్‌లైన్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసి బిల్లులు పాస్ చేసుకుంటే మాత్రం అందుకు పంచాయతీ కార్యదర్శిని బాధ్యున్ని చేసి సస్పెండ్ చేస్తారు.

All payments are made online in Panchayat

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంచాయతీ నిధుల దుర్వినియోగానికి చెక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.