బీళ్లన్నిటికీ నీళ్లు…

Godavari water

 

కాళేశ్వరంతో హైదరాబాద్ కు అభయం : కెటిఆర్ ట్వీట్లు

హైదరాబాద్ : ప్రాణహిత నుంచి కొనసాగుతున్న వరదనీటితో మేడిగడ్డ బరాజ్, అక్కడి నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్‌నుంచి నిరంతరాయంగా ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్ భారీ జలాశయాలను తలపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్‌లో మంగళవారం సాయంత్రానికి 7.50 టిఎంసిలు, అన్నారం బరాజ్‌లో 5 టిఎంసిల నీరు చేరుకున్నది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు జలాలపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ట్విటర్‌లో స్పందించారు. ‘కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతల జరుగుతోంది.

ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టిఎంసిలు ఒడిసిపట్టాం. గోదావరిలో తక్కువ వరద ఉన్నప్పుడే 11 టిఎంసిలు నిల్వచేయడం జరిగింది. ఇప్పటికే పట్టిన నీటితో లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.. వర్షాలు పడి, వరద పెరిగితే అన్ని మోటార్లు మొదలైతే తెలంగాణలో బీళ్లన్ని గోదావరి నీటితో సస్యశామలవుతాయి.

ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది.’ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. ‘సిఎం కెసిఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై తరహా నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చు. దేశంలోని చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి ఎదురయ్యే ఛాన్సే లేదని’ కెటిఆర్ పేర్కొన్నారు.

All lands with Godavari water get greenery

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బీళ్లన్నిటికీ నీళ్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.