చింతమడక గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు

Chintamadaka Villageసిద్ధిపేట : చింతమడక గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి చింతలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని సిద్ధిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం కెసిఆర్ తన సొంతగ్రామమైన చింత మడకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణోద్యమ సమయంలో కెసిఆర్ కు అండగా చింతమడక గ్రామ ప్రజలు నిలిచారని ఆయన గుర్తు చేశారు. ఈ గ్రామానికి కెసిఆర్ రావడంతో అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాథి కల్పిస్తామని ఆయన చెప్పారు. చింతమడకలో అబివృద్ధి కోసం పది కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు. తన నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన సిఎం కెసిఆర్ ను కోరారు.

All Infrastructure In Chintamadaka Village

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చింతమడక గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.