అలిగిన బతుకమ్మ

  బతుకమ్మ పండుగలో ఆరో రోజును ’అలిగిన బతుకమ్మ’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. బతుకమ్మ పాట రామ రామ ఉయ్యాలో… రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో.. రామ రామ నంది ఉయ్యాలో […] The post అలిగిన బతుకమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బతుకమ్మ పండుగలో ఆరో రోజును ’అలిగిన బతుకమ్మ’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు.

బతుకమ్మ పాట

రామ రామ ఉయ్యాలో…

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..
రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..
పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బాలాకుమరుడా ఉయ్యాలో..
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాసము ఉయ్యాలో..
బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో..
తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..
పన్నెండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో..
తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్లు ఉయ్యాలో..
నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..
నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్లు ఉయ్యాలో..
పచ్చ పచ్చయి గుల్లు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో..
పచ్చయి పరకాన ఉయ్యాలో మల్లన్న గుల్లు ఉయ్యాలో..
పర్వతాల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..

Aligina Bathukamma Festival Celebrations

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అలిగిన బతుకమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: