కారు ముందు ఏలియన్ డ్యాన్స్…!

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన వివియాన్ గోమెజ్ కు ఎదురైన ఈ వింత అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు వద్ద ఓ వింత ఆకారం నాట్యం చేయడం సిసి కెమెరాల్లో రికార్డు కావడాన్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో వివియాన్ మాట్లాడారు. తన […] The post కారు ముందు ఏలియన్ డ్యాన్స్…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన వివియాన్ గోమెజ్ కు ఎదురైన ఈ వింత అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు వద్ద ఓ వింత ఆకారం నాట్యం చేయడం సిసి కెమెరాల్లో రికార్డు కావడాన్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో వివియాన్ మాట్లాడారు. తన కారుకు సమీపంలో ఓ వింత ఆకారం చిందులేసిందని, చిన్న నీడ అటువైపుగా వచ్చిందని, ఆ తరువాత కారు సమీపంలో నృత్యం చేసిందని, ఆ జీవి ఏమై ఉంటుందా అని కనిపెట్టేందుకు యత్నించానని, అయితే ఇంటి వద్ద అమర్చిన మిగిలిన రెండు కెమెరాలు పనిచేయకపోవడంతో వీలు పడలేదని వివియాన్ తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వింత జీవిని కొందరు గ్రహాంతరవాసిగా చెబుతుంటే, మరికొందరు మాత్రం అది తయారు చేసిన వీడియో అయి ఉండొచ్చని చెబుతున్నారు.

Alien Dance Before Car In America

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కారు ముందు ఏలియన్ డ్యాన్స్…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: