అలెక్స్ కారే పోరాటంపై ఫిదా

బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా యువ వికెట్ కీపర్ అలెక్స్ కారే పోరాట పటిమపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కారే తీవ్రంగా గాయపడ్డాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కారే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో గాయపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారే దవడను బలంగా తాకింది. అక్కడ చీలిక ఏర్పడి రక్తం రావడం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒకవైపు ఇంగ్లండ్ క్రికెటర్లు, […] The post అలెక్స్ కారే పోరాటంపై ఫిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా యువ వికెట్ కీపర్ అలెక్స్ కారే పోరాట పటిమపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కారే తీవ్రంగా గాయపడ్డాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కారే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో గాయపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి కారే దవడను బలంగా తాకింది. అక్కడ చీలిక ఏర్పడి రక్తం రావడం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒకవైపు ఇంగ్లండ్ క్రికెటర్లు, మరోవైపు అంపైర్లు, సహచరుడు స్మిత్ కూడా కారే గాయాన్ని చూసి కంగారు పడ్డారు. ఒకవైపు రక్తం కారుతున్నా, నొప్పి వేధిస్తున్నా కారే మాత్రం మైదానాన్ని వీడలేదు.

అప్పటికే జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోవడంతో బ్యాటింగ్ కొనసాగించాలని నిర్ణయించాడు. గాయం బాధిస్తున్నా లెక్కచేయలేదు. ప్రాథమిక చికిత్స చేయించుకుని బ్యాటింగ్ కొనసాగించాడు. గాయం తీవ్ర ఎక్కువగానే ఉన్నా బ్యాండేజ్‌తో క్రీజులో నిలిచాడు. ఇదే క్రమంలో కీలక ఇన్నింగ్స్ జట్టును ఆదుకున్నాడు. నొప్పి బాధిస్తున్నా కారే 70 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 46 పరుగులు చేశాడు.

అప్పట్లో కుంబ్లే

గతంలో వెస్టిండీస్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో కుంబ్లే గాయంతోనే స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. ఆ మ్యాచ్‌లో విండీస్ బౌలర్ డిల్లాన్ విసిరిన బౌన్సర్ కుంబ్లే దవడను గట్టిగా తగిలింది. రక్తం కారుతున్నా జంబో అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం ప్రాథమిక చికిత్స చేయించుకొని మళ్లీ బ్యాండేజ్‌తోనే ఫీల్డింగ్ కోసమని మైదానంలోకి అడుగుపెట్టాడు. బంతితోనూ మాయ చేసి కీలకమైన లారా (4) వికెట్ పడగొట్టాడు. నాటి అతని ప్రదర్శన ప్రతి క్రికెట్ అభిమానికి ఇప్పటికీ జ్ఞాపకమే. తాజాగా కారే కూడా ఇలాంటి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.

Alex Carey survives major injury

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అలెక్స్ కారే పోరాటంపై ఫిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: