శానిటైజర్ల తయారీలో ఆల్కహాల్ కంపెనీలు

లండన్ : కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్తగా వాడే శానిటైజర్లు వంటి ఆరోగ్య పరికరాలు ఇప్పుడు కొరతగా ఉన్నాయి. ఆస్పత్రులు, వైద్యసంస్థల్లో ఇవి దొరకడం కష్టమౌతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తదితర దేశాల్లో హ్యేండ్ శానిటైజర్లను తయారు చేయడానికి ఆల్కహాలు తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. స్కాట్లాండ్ లోని బీరు తయారీ సంస్థ బ్రూడాగ్ శానిటైజర్ తయారీని ప్రారంభించింది. ఈ విధంగా ప్రజల ఆరోగ్య భద్రతకు సహాయపడతామని ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. స్కాట్లాండ్ లోని […] The post శానిటైజర్ల తయారీలో ఆల్కహాల్ కంపెనీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్ : కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్తగా వాడే శానిటైజర్లు వంటి ఆరోగ్య పరికరాలు ఇప్పుడు కొరతగా ఉన్నాయి. ఆస్పత్రులు, వైద్యసంస్థల్లో ఇవి దొరకడం కష్టమౌతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తదితర దేశాల్లో హ్యేండ్ శానిటైజర్లను తయారు చేయడానికి ఆల్కహాలు తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. స్కాట్లాండ్ లోని బీరు తయారీ సంస్థ బ్రూడాగ్ శానిటైజర్ తయారీని ప్రారంభించింది. ఈ విధంగా ప్రజల ఆరోగ్య భద్రతకు సహాయపడతామని ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. స్కాట్లాండ్ లోని డీసైడ్ డిస్టిలరీ కూడా హ్యాండ్ శానిటైజర్లను తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. అనేక సంస్థలు ఈ విషయమై తమను సంప్రదించాయని, నర్సరీలు, స్కూళ్లు, కేర్‌హోమ్స్, వైద్యకేంద్రాలకు, కావలసిన శానిటైజర్ వంటి పరికరాలను వీలైనంతవరకు తాము తయారు చేసి అందిస్తామని తెలియచేసింది.

బ్రిటన్ కాకుండా ఇతర దేశాల ఆల్కహాల్ తయారీ సంస్థలు శానిటైజర్ల తయారీని ప్రారంభించాయి. స్టాక్‌హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న అబొసోలట్ అనే ఆల్కహాలు తయారీ సంస్థ ఈ విధంగా ప్రజలకు సహాయం చేయడానికి అవకాశం లభించడం ఆనందంగా ఉందని ప్రకటించింది. లగ్జరీ గ్రూపు ఎల్‌విఎంహెచ్ తమ మూడు పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీల నుంచి శానిటైజర్లను తయారు చేస్తామని మార్చి 14న ప్రకటించింది. మొదట వీటిని ఆస్పత్రులకు సరఫరా చేస్తామని వివరించింది. బ్రిటన్‌లో శానిటైజర్ల కొరత ఎక్కువగానే ఉంది. బూట్స్ వంటి ఫార్మసీ సంస్థలు వినియోగదారులకు ఒక్కొక్కరికి మూడు వంతున శానిటైజర్లను సరఫరా చేస్తోంది.

Alcohol companies in the manufacture of sanitizers

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శానిటైజర్ల తయారీలో ఆల్కహాల్ కంపెనీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: