హాలీవుడ్ చిత్రాలకు షాకిచ్చిన అల్లు అర్జున్..

 

సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలీష్ స్టార్ ‘అల వైకుంఠపురంలో’ రెండు తెలుగు చిత్రాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కలెక్షన్స్ తో దుమ్ముదులుపుతున్నాయి. వీటితోపాటు సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ మూవీ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాదు, హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టిమరి దూసుకుపోతున్నాయి. అమెరికన్ మీడియా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కామ్ స్కోర్ ఈ వారంలో విడుదలైన సినిమాల్లో టాప్ పది చిత్రాల తొలి వారం వసూళ్లను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ‘అల వైకుంఠపురములో’ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. దీంతోపాటు ‘సరిలేరు నీకెవ్వరు’, నాలుగో స్థానం, ‘దర్బార్’ ఐదవ స్థానంలో చోటు దక్కించుకున్నాయి. మరో రెండు బాలీవుడ్ చిత్రాలు టాప్ టెన్ జాబితాలో నిలిచాయి. కాగా, టాప్ ఐదు చిత్రాల్లో మూడు దక్షణాది సినిమాలే ఉండటం విశేషం. మొత్తంమీద ఈ వారం విడుదలైన ఐదు భారతీయ చిత్రాలు హాలీవుడ్ మూవీస్ ను మించి కలెక్షన్స్ రాబడుతుండడం గొప్ప విషయమని, ఇది భారతీయ చిత్రపరిశ్రమకు దక్కిన అరుదైన గౌరవం అని సినీ విశ్లేషకులు రమేష్ బాలా ట్వీట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు భారతీయ చిత్రపరిశ్రమ ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇక, రమేష్ బాలా చేసిన ట్వీట్ కు హీరోయిన్ పూజా హెగ్డే స్పందిస్తూ ‘వావ్’ అని ట్వీట్ చేసింది.

Ala Vikuntapuramlo get top Weekend Box Office of USA

The post హాలీవుడ్ చిత్రాలకు షాకిచ్చిన అల్లు అర్జున్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.