మిత్రపక్షం మజ్లిస్‌కు పెద్దపీఠ…

Akbaruddinహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మిత్రపక్షం మజ్లిస్‌కు సిఎంకెసిఆర్ పెద్ద పీఠ వేశారు. ఇటీవల శాసన సభలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కట్టబెట్టారు. ప్రస్తుత శాసన సభ సమావేశాలలో మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో 2019-20 పూర్థి స్థాయి బడ్జెట్ సమావేశాలలో మజ్లిస్ పార్టీ శాసన సభ్యులకు ప్రధాన ప్రతిపక్షం హోదా మేరకు శాసన సభలో పార్టీ సభ్యులకు సీట్లను కేటాయించారు. తొలి రోజు స్వయంగా సిఎంకెసిఆర్ మజ్లిస్ శాసన సభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసిని కలిసి అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రధాన ప్రతిక్ష పార్టీకి అప్పగించే ప్రజాపద్దుల కమిటీ(పిఏసి) చైర్మన్‌గా మజ్లిస్ శాసన సభ పక్షనేత, చాంద్రాయణగుట్ట శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసి నియమితులైనారు.అలాగే పబ్లీక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా మజ్లిస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యకుత్‌పూరా నియోజక వర్గం శాసన సభ్యులు ఆహ్మద్ పాష ఖాద్రీ నియమితులైనారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలి సారి 2014లో జరిగిన శాసన సభ

ఎన్నికల్లో మజ్లిస్ ఏడు స్థానాలో విజయం సాధించగా, 2018 మలి ఎన్నికల్లో సహితం ఏడు నియోజక వర్గాల్లో గెలుపొందారు. ఇదిలా ఉండగా అక్బరుద్దీన్ ఒవైసీ 1999లో తొలి సారి చార్మినార్ నియోజక వర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో గెలుపొందగా,2004లో కూడా ఇదే నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో గెలుపొంది పార్టీ పక్ష నేతగా వ్యవహారిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన 2009,2014,2018 శాసన సభ ఎన్నికల్లో ఆయన చాంద్రాయణగుట్ట నియోజక వర్గం నుంచే అంసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Akbaruddin Owaisi Appointed as Telangana PAC Chairman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిత్రపక్షం మజ్లిస్‌కు పెద్దపీఠ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.