నెగటివ్ షేడ్స్ పాత్రలో ఐష్

  దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తున్న అందాల తార ఐశ్వర్యా రాయ్ రీ ఎంట్రీలో కూడా దుమ్ము రేపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బిడ్డ పుట్టడంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఐష్ గతంతో పోల్చితే కాస్త తక్కువ సినిమాలు చేస్తోంది. మంచి కథ, మంచి పాత్ర అయితేనే నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా ఆమె మణిరత్నం దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని […] The post నెగటివ్ షేడ్స్ పాత్రలో ఐష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తున్న అందాల తార ఐశ్వర్యా రాయ్ రీ ఎంట్రీలో కూడా దుమ్ము రేపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బిడ్డ పుట్టడంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న ఐష్ గతంతో పోల్చితే కాస్త తక్కువ సినిమాలు చేస్తోంది. మంచి కథ, మంచి పాత్ర అయితేనే నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా ఆమె మణిరత్నం దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా కెరీర్‌లోనే మొదటి సారి ఐశ్వర్యా రాయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అందులో చేయబోతుందట. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ’పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఐశ్వర్య నటించేందుకు ఓకే చెప్పిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఈ స్టార్ బ్యూటీ విలన్ గా కనిపించబోతుందంటున్నారు. మణిరత్నం పలు చిత్రాలతో ఐశ్వర్యారాయ్ కి మంచి బ్రేక్ ఇచ్చారు. అందుకే ఎప్పుడు ఆయన కోరినా కూడా ఐష్ నటించేందుకు ఓకే చెబుతుంది. అలాగే ఇప్పుడు కూడా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో విలన్ గా నటించేందుకు ఓకే చెప్పి ఉంటుందని భావించవచ్చు. అయితే ఐష్‌ను విలన్‌గా ఆమె అభిమానులు ఒప్పుకుంటారా అనేది చూడాలి.

Aishwarya Rai Comes Back With A Role In Negative Shade

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నెగటివ్ షేడ్స్ పాత్రలో ఐష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: