మణిరత్నం సినిమాలో విలన్ గా ఐష్

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ చారిత్రాత్మక సినిమాను తీసేందుకు సన్నహాలు చేస్తున్నారు. చోళ రాజుల కాలంలో నడిచే కథతో ఆయన తన కొత్త సినిమాను తీయబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను ఆయన రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, శింబు, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే సినిమాలో విశ్వ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఓ కీలక పాత్రను […] The post మణిరత్నం సినిమాలో విలన్ గా ఐష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ చారిత్రాత్మక సినిమాను తీసేందుకు సన్నహాలు చేస్తున్నారు. చోళ రాజుల కాలంలో నడిచే కథతో ఆయన తన కొత్త సినిమాను తీయబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను ఆయన రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, శింబు, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే సినిమాలో విశ్వ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారని, ఆమె విలన్ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఐష్ చేసే విలన్ పాత్ర ఈ సినిమా కథలో కీలక మలుపు తిప్పుతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐష్ పాత్రపై మణిరత్నం కానీ, ఆమె కానీ స్పష్టత ఇవ్వలేదు.  ఈ సినిమాను మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Aishwarya Rai Act As Villain in Mani Ratnam Film

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మణిరత్నం సినిమాలో విలన్ గా ఐష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: