జయలలిత బయోపిక్ లో అనుష్క..?

సినిమా: వెండితెరపై కథానాయికగా, తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసి శక్తిమంతమైన నాయకురాలిగా ఎదిగి ప్రజల మనసులను దోచుకున్నారు జయలలిత. అంతేకాకుండా అన్నివర్గాల నుంచి ఆప్యాయంగా అమ్మ అనిపించుకున్నారు. అటువంటి జయలలిత బయోపిక్ ను నిర్మించేందుకు దర్శకులు ఎ.ఎల్. విజయ్, ప్రియదర్శన్, భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. భారతీరాజా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా సమాచారం. జయలలిత బయోపిక్ కోసం ఐశ్వర్య రాయ్, అనుష్కలను సంప్రదిస్తున్నట్టుగా టాక్. ఈ ప్రాజెక్టుకు ఐశ్వర్య ఒకె అంటే […]

సినిమా: వెండితెరపై కథానాయికగా, తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసి శక్తిమంతమైన నాయకురాలిగా ఎదిగి ప్రజల మనసులను దోచుకున్నారు జయలలిత. అంతేకాకుండా అన్నివర్గాల నుంచి ఆప్యాయంగా అమ్మ అనిపించుకున్నారు. అటువంటి జయలలిత బయోపిక్ ను నిర్మించేందుకు దర్శకులు ఎ.ఎల్. విజయ్, ప్రియదర్శన్, భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. భారతీరాజా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా సమాచారం. జయలలిత బయోపిక్ కోసం ఐశ్వర్య రాయ్, అనుష్కలను సంప్రదిస్తున్నట్టుగా టాక్. ఈ ప్రాజెక్టుకు ఐశ్వర్య ఒకె అంటే జాతీయస్థాయిలో ఈ బయోపిక్ అందరి దృష్టిలో పడుతుంది. ఆమె కాదంటే మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకి మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ఇండస్ట్రీలో నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయడంలో అనుష్కకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సిన్మాకి ‘పురిచ్చి తలైవి’ … ‘అమ్మ’ అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. డిసెంబర్ ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related Stories: