జియోఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్

Airtel

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఎయిర్‌టెల్ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ ఫైబర్‌ను ఆఫర్ చేస్తోంది. దీని కింద నెలకు రూ.3,999లకు 1జిబిపిఎస్ స్పీడ్‌ను అందిస్తోంది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ తాజాగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ నుండి తాజా ఆఫర్‌తో బ్రాడ్‌బ్యాంక్ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. న్యూఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, చండీగడ్, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, అహ్మదాబాద్ నగరాల్లోని ఇళ్లు, సోహో (చిన్న ఆఫీస్ హోమ్ ఆఫీస్), చిన్న వ్యాపార సంస్థలకు బుధవారం నుంచి ఈ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో ఈ సేవలను ఇతర మార్కెట్లలో ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. దీంతో పాటు అపరిమిత ల్యాండ్‌లైన్ కాల్స్, నెట్‌ఫ్లిక్స్‌కు మూడు నెలల చందా, అమెజాన్ ప్రైమ్‌కు ఒక సంవత్సరం చందా, జి5ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‌లోని ప్రీమియం కంటెంట్ కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

Airtel new broadband plan on Jio Fiber plan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జియోఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.