నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు తెస్తా: కవిత

    నిజామాబాద్: సిఎం కెసిఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా ఎంతో ఆలోచించి ప్రవేశపెడుతున్నారని ఎంపి కవిత పొగిడారు. జక్రాన్ పల్లిలో టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో కవిత మాట్లాడారు. పిఎఫ్ కార్డు ఉన్న బిడి కార్మికులందరికీ మే నుంచి రూ.2వేల పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తామని కవిత స్పష్టం […] The post నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు తెస్తా: కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

నిజామాబాద్: సిఎం కెసిఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా ఎంతో ఆలోచించి ప్రవేశపెడుతున్నారని ఎంపి కవిత పొగిడారు. జక్రాన్ పల్లిలో టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో కవిత మాట్లాడారు. పిఎఫ్ కార్డు ఉన్న బిడి కార్మికులందరికీ మే నుంచి రూ.2వేల పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తామని కవిత స్పష్టం చేశారు. త్వరలోనే జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు రానుందని, ఎయిర్ పోర్టు కోసం 800 ఎకరాల భూమిని చూశామన్నారు. మళ్లీ ఎంపిగా అవకాశం ఇస్తే శక్తి వంచనలేకుండా పని చేస్తామని హామీ ఇచ్చారు.

కెసిఆర్ మీద ఉన్న నమ్మకంతోనే సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారని ఎంఎల్‌ఎ బాజిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఖర్చుకోసం సింగరేణి కార్మికులు తమకు ఐదు లక్షల రూపాయల సాయం అందించారని పొగిడారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు రావడం ఖాయమన్నారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను బాజిరెడ్డి కోరారు.

 

 

The post నిజామాబాద్ కు ఎయిర్ పోర్టు తెస్తా: కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: