సీఎన్‌జీ గ్యాస్‌తో వాయు కాలుష్యానికి కట్టడి

  బొగ్గు స్థానంలో గ్యాస్ వాడేందుకు పరిశ్రమలు మొగ్గు ఇప్పటికే 19 పరిశ్రమల్లో అమలు చేస్తున్న పిసీబీ మరో 46 పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకు నేందుకు సన్నాహాలు హైదరాబాద్ : గ్రేటర్ ఇప్పటికే కాలుష్యం వెదజల్లే నగరాల్లో ఐదో స్థానం చేరుకుంది. ఇదే విధంగా ఉంటే మరో ఐదేళ్లలో ప్రజలు నివసించడం కష్టతరంగా మారుతుందని ఇటీవలే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి కాలుష్య కారకాలను వినియోగించకుండా చేయాలని […] The post సీఎన్‌జీ గ్యాస్‌తో వాయు కాలుష్యానికి కట్టడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బొగ్గు స్థానంలో గ్యాస్ వాడేందుకు పరిశ్రమలు మొగ్గు
ఇప్పటికే 19 పరిశ్రమల్లో అమలు చేస్తున్న పిసీబీ
మరో 46 పరిశ్రమల్లో ఏర్పాటు చేసుకు నేందుకు సన్నాహాలు

హైదరాబాద్ : గ్రేటర్ ఇప్పటికే కాలుష్యం వెదజల్లే నగరాల్లో ఐదో స్థానం చేరుకుంది. ఇదే విధంగా ఉంటే మరో ఐదేళ్లలో ప్రజలు నివసించడం కష్టతరంగా మారుతుందని ఇటీవలే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి కాలుష్య కారకాలను వినియోగించకుండా చేయాలని సూచించింది. దీంతో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కొత్త మార్గాలు అనుసరిస్తుంది. పరిశ్రమల్లో కాలుష్య రహిత ఇంధనమైన సంపీడన సహాజవాయువు పెట్రోలియం సహాజ వాయువుల వాడకాన్ని ప్రోతహిస్తోంది.

నగర శివారు ప్రాంతాల్లో వందలాది బల్క్‌డ్రగ్, ఫార్మా, గ్లాస్, సిమెంటు, ఇసుకు పరిశ్రమలున్నాయి. వీటిలో ఉత్పాదక సమయంలో బాయిలర్లు, ఫర్నేసులను ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడం కోసం బొగ్గు, డీజిల్ వాడుతున్నారు. తక్కువ ధరకు బొగ్గు లభ్యమవుతుండటంతో ఎక్కువ వాడుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. కంపెనీల నుంచి వచ్చే పొగలతో సమీప ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కాలుష్య స్థాయిల్లోనూ వ్యత్యాసాలుంటున్నాయి. బొగ్గు కారణంగా, ఘన వ్యర్థాలు, దుమ్మకణాలు సైతం పెరిగిపోతున్నాయి. మహానగరంలో తాజాగా 42వేల కిలోల సిఎన్‌జీ గ్యాస్ సరఫరా అవుతుండగా, 25వేల కిలోల గ్యాస్ మాత్రమే వినియోగిస్తున్నారు. ఇప్పటికే 19 పరిశ్రమలు గ్యాస్‌ను వాడుతూ ఉత్పత్తి చేస్తున్నారు. మరో 46 కంపెనీలో వినియోగించేందుకు అధికారులు యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గాజుల తయారీలో ఏజిఐ కంపెనీ నిర్వహకులు పూర్తిగా సిఎన్‌జీ గ్యాస్ వినియోగిస్తున్నారు. బొగ్గు వాడకంతో వెలువడిన ఉష్ణశక్తి కంటే గ్యాస్ నుంచి అధిక శక్తి విడుదల కావడంతో పాటు కాలుష్యరహితం కావడంతో అప్పటి నుంచి వారు గ్యాస్‌ను వాడుతున్నారు. గ్యాస్‌ను పరిశ్రమలకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నగరానికి సహాజవాయువు సరఫరా చేస్తున్న బిజిసిఎల్ పలు ప్రాంతాల్లో సీఎన్‌జి పైపులైన్లకు ద్వారా అందించబోతుంది. ప్రస్తుతం జీడిమెట్ల, బాలానగర్, నాచారం, పటాన్‌చెరువు, ఉప్పల్ పారిశ్రామిక వాడల్లో దశల వారీగా వేసేందుకు సిద్ధ్దమైన్నట్లు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. సీఎన్‌జీ గ్యాస్ వాడకం ద్వారా కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు కంపెనీల ఉత్పతక పెట్టుబడుల్లో మిగులు ఉంటుందని పిసీబి అధికారులు వివరిస్తున్నారు.

Air pollution with CNG gas can be prevented

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సీఎన్‌జీ గ్యాస్‌తో వాయు కాలుష్యానికి కట్టడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: