వచ్చే నెల నుంచి ఎయిరిండియా కొత్త సర్వీసులు

 

న్యూఢిల్లీ: వేసవిలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వచ్చే నెల నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కొత్తగా అనేక విమాన సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్టు ఎయిరిండియా బుధవారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి ముంబయి-దుబాయ్ -ముంబయి మార్గంలో వారానికి అదనంగా 3,500 సీట్లను ఏర్పాటు చేశామని తెలిపింది. అలాగే, జూన్ 2వ తేదీ నుంచి ఢిల్లీ-దుబాయ్‌-ఢిల్లీ రూట్‌లో బి 787 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా వారానికి 3,500 సీట్లు అదనంగా అందిస్తామని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ‘అలాగే ఢిల్లీ, ముంబయి నుంచి దుబాయికి ఎకనమీ క్లాస్ ప్రమోషనల్ ఫేర్ ఒకవైపు ప్రయాణానికి రూ.7777(అన్ని కలిపి) ఉంటుంది. ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు ఈ టిక్కెట్లపై ప్రయాణించవచ్చు’ అని ఎయిరిండియా తెలిపింది.

Air India to start new services from June

The post వచ్చే నెల నుంచి ఎయిరిండియా కొత్త సర్వీసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.