ఎయిర్ ఇండియా సేల్‌కు అక్టోబర్ గడవు!

  ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే ప్రక్రియ బడ్జెట్ అనంతరం వేగవంతమవుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న నేపథ్యంలో అందరి దృష్టి ఎయిర్ ఇండియాపై నెలకొంది. అయితే ఎయిర్ ఇండియా విక్రయానికి అక్టోబర్ వరకు గడువు నిర్ణయించే అవకాశముందని తెలుస్తోంది. పలుమార్లు బిడ్డింగ్‌కు వెళ్లి విఫలమైన నేపథ్యంలో ఈసారి సమర్థవంతమైన బిడ్డర్లను ఖరారు చేసి, బిడ్ విఫలం కాకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికార […] The post ఎయిర్ ఇండియా సేల్‌కు అక్టోబర్ గడవు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే ప్రక్రియ బడ్జెట్ అనంతరం వేగవంతమవుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న నేపథ్యంలో అందరి దృష్టి ఎయిర్ ఇండియాపై నెలకొంది. అయితే ఎయిర్ ఇండియా విక్రయానికి అక్టోబర్ వరకు గడువు నిర్ణయించే అవకాశముందని తెలుస్తోంది. పలుమార్లు బిడ్డింగ్‌కు వెళ్లి విఫలమైన నేపథ్యంలో ఈసారి సమర్థవంతమైన బిడ్డర్లను ఖరారు చేసి, బిడ్ విఫలం కాకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికార వర్గాల సమాచారం. ఈ విమాన సంస్థ పూర్తి విక్రయం చేపట్టనుందని, అయితే దీనిపై మంత్రుల ప్యానెల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. నీతి ఆయోగ్ ఎయిరిండియాలో పూర్తి స్థాయి వాటాల విక్రయం ప్రతిపాదన చేసింది. 74 శాతం వాటాలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది.

Air India employees oppose move to privatise the airline

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎయిర్ ఇండియా సేల్‌కు అక్టోబర్ గడవు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: