ఢిల్లీ ఎయిమ్స్ కంటే మెరుగైనది కరీంనగర్ లో నిర్మిస్తా: వినోద్

      కరీంనగర్: కరీంనగర్‌లో ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కంటే మెరుగైనది ఏర్పాటు చేస్తామని ఎంపి వినోద్ తెలిపారు. మంగళవారం వినోద్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి రోజుల్లోనే తెలంగాణకు నీళ్లు, నిధుల గురించి లోక్ సభలో గళమెత్తామని, తమ ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చి మళ్లీ తమకు అధికారం ఇచ్చారని పొగిడారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయని, కరీంనగర్‌లో నాలుగు […] The post ఢిల్లీ ఎయిమ్స్ కంటే మెరుగైనది కరీంనగర్ లో నిర్మిస్తా: వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

 

కరీంనగర్: కరీంనగర్‌లో ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కంటే మెరుగైనది ఏర్పాటు చేస్తామని ఎంపి వినోద్ తెలిపారు. మంగళవారం వినోద్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి రోజుల్లోనే తెలంగాణకు నీళ్లు, నిధుల గురించి లోక్ సభలో గళమెత్తామని, తమ ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చి మళ్లీ తమకు అధికారం ఇచ్చారని పొగిడారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయని, కరీంనగర్‌లో నాలుగు లైన్ల రైల్వే స్టేషన్ జంక్షన్ కాబోతుందన్నారు.

జిల్లాలో నాలుగు చోట్ల రైల్వే ఫ్లై ఓవర్లు వచ్చాయన్నారు. రూ.250 కోట్ల టెండర్‌తో స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయన్నారు. ఐటి టవర్ పనులు, కేబుల్ బ్రిడ్జీ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎల్‌ఎండి కూడా పూర్తి స్థాయిలో రిజర్వాయర్ కాబోతోందని, కరీంనగర్ డైరీ ఒకప్పుడు 70 లక్షలు లీటర్లు ఉండేదని ఇప్పుడు 250 లక్షల లీటర్లకు పెంచామని వినోద్ వెల్లడించారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌లా కేంద్రంలో పని చేశామన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు కానీ కాళేశ్వరానికి మోడీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఎయిర్‌స్ట్రిప్ రాబోతోందన్నారు.

 

AIMS Will Construct in Karimnagar: Vinod Kumar

 

The post ఢిల్లీ ఎయిమ్స్ కంటే మెరుగైనది కరీంనగర్ లో నిర్మిస్తా: వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: