రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం

Rahul Gandhiఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి రాహుల్ సురక్షితంగా బయటపడడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరారు. ఈ క్రమంలో కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలటు్ల  ఉన్నతాధికారులకు సమస్యను వివరించిన అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యపై రాహుల్ గాంధీ ట్విటర్ లో స్పందించారు.  విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల తాను పాల్గొననున్న సభ ఆలస్యంగా ప్రారంభవుతుందని, ఇందుకు పార్టీ కార్యకర్తలు మన్నించాలని ఆయన కోరారు. శుక్రవారం బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగనున్న సభల్లో రాహుల్‌ పాల్గొనున్నారు.
 AICC Chief Rahul Gandhi Escaped from Accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.