కల్యాణ మండపంగా ముస్తాబైన జయలలిత సమాధి

  చెన్నై:దివంగత ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె మాజీ అధినేత్రి జయలలితపై తమ భక్తిభావాన్ని చాటుకున్నాడు ఆ పార్టీ నాయకుడు ఒకరు. తన కుమారుడి వివాహాన్ని తాను ఆరాధ్య దైవంగా భావించే జయలలిత సమాధి వద్దనే జరిపించాడు. ఇందుకోసం మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత సమాధిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. నగరానికి చెందిన అన్నాడిఎంకె నాయకుడు ఎస్ భవానీశంకర్ కుమారుడు ఎస్‌పి సాంబశివరామన్ అలియాస్ సతీశ్ సాంప్రదాయ రీతిలో దీపిక మెడలో బుధవారం అక్కడే తాళికట్టాడు. సమాధి చుట్టూ […] The post కల్యాణ మండపంగా ముస్తాబైన జయలలిత సమాధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెన్నై:దివంగత ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె మాజీ అధినేత్రి జయలలితపై తమ భక్తిభావాన్ని చాటుకున్నాడు ఆ పార్టీ నాయకుడు ఒకరు. తన కుమారుడి వివాహాన్ని తాను ఆరాధ్య దైవంగా భావించే జయలలిత సమాధి వద్దనే జరిపించాడు. ఇందుకోసం మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత సమాధిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. నగరానికి చెందిన అన్నాడిఎంకె నాయకుడు ఎస్ భవానీశంకర్ కుమారుడు ఎస్‌పి సాంబశివరామన్ అలియాస్ సతీశ్ సాంప్రదాయ రీతిలో దీపిక మెడలో బుధవారం అక్కడే తాళికట్టాడు.

సమాధి చుట్టూ ప్రదక్షిణ కోసం ఏర్పాటు చేసిన నడక దారిలో కూర్చున వధూవరులు మిత్రులు, బంధువుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు. బ్రాహ్మణుల వేద మంత్రాలు, నాదస్వర సంగీతం మధ్య వధువు మెడలో వరుడు మంగళసూత్ర ధారణ చేశాడు. అనంతరం సమాధి వద్ద ఏర్పాటు చేసిన జయలలిత చిత్రపటానికి నూతన జంట సాష్టాంగ ప్రణామం చేసి ఆశీర్వాదాలు స్వీకరించింది.
AIADMK leader’s Son Wedding at Jayalalitha Samadhi  Party workers said the marriage at Ammas(Jayalalithaa) mausoleum gave them the satisfaction of the wedding being blessed by the late leader.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కల్యాణ మండపంగా ముస్తాబైన జయలలిత సమాధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: