14.39 శాతం తగ్గిన వ్యవసాయ ఎగుమతులు

Agricultural Exports

 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూలై)లో దేశ వ్యవసాయ ఎగుమతులు 14.39 శాతం క్షీణించి 5.45 బిలియన్ డాలర్లకు(రూ .38,700 కోట్లు) చేరాయి. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) ఈ గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం, ఈ కాలంలో బాస్మతి, -బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 9.26 శాతం తగ్గి 1.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 38.3 శాతం తగ్గి 69.5 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గ్వార్ గమ్, వేరుశనగ, గేదె మాంసం, మేక మాంసం, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన పండ్లు, కూరగాయలు, పువ్వులు, విత్తనాల ఎగుమతుల్లోనూ క్షీణతను నమోదైంది.

Agricultural exports dipped by 14.39% in April, July

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 14.39 శాతం తగ్గిన వ్యవసాయ ఎగుమతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.