బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్‌ ఘన విజయం

  చిట్టగాంగ్: ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు తమ టెస్టు కెరీర్ లో రెండో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా కేవలం 173 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులేస్తూ బంగ్లా బ్యాట్స్‌మెన్‌లపై విరుచుకుపడ్డారు. దీంతో బంగ్లా వరుసగా వికెట్లు చేజార్చుకొని ఘోర ఓటమిని చవిచూసింది. ఓపెనర్ […] The post బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్‌ ఘన విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిట్టగాంగ్: ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు తమ టెస్టు కెరీర్ లో రెండో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 398 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా కేవలం 173 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులేస్తూ బంగ్లా బ్యాట్స్‌మెన్‌లపై విరుచుకుపడ్డారు. దీంతో బంగ్లా వరుసగా వికెట్లు చేజార్చుకొని ఘోర ఓటమిని చవిచూసింది. ఓపెనర్ షద్మాన్ ఇస్లాం(41), షకీబ్ అల్ హసన్(44) కాసేపు పోరాడారు. మిగితా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా నిరాశపర్చారు.

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ 6 వికెట్లతో చెలరేగగా.. జహీర్‌ఖాన్ 3 వికెట్లతో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రషీద్‌ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. అంతకుముందు అఫ్ఘానిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 342, బంగ్లాదేశ్‌ 205 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్ఘాన్‌ 260 పరుగులు చేసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలిచి తొలి విజయాన్ని నమోదుచేసింది.

AFG vs BAN Test: Afghanistan won by 224 runs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్‌ ఘన విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.