హైదరాబాద్‌కు 19 విమానాలు వస్తాయి: సిఎస్

Aeroplane services started at Telangana

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన సందర్భంగా ఏర్పాట్లను సిఎస్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు.  ప్రయాణికుల ఆరోగ్యంపై ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విమానాశ్రయంలో టచింగ్ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు 19 విమానాలు వస్తాయని, మరో 19 విమనాలు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తాయన్నారు. ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని, కరోనా లక్షణాలు లేనివారికి 14 రోజుల క్వారంటైన్ లేదన్నారు. సోమవారం 16 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వస్తున్నారు. మంగళవారం నుంచి మరిన్ని విమాన సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి ప్రయాణికుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ సూచనలు పాటించాలన్నారు.

The post హైదరాబాద్‌కు 19 విమానాలు వస్తాయి: సిఎస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.