కౌమారదశ నైపుణ్యాలు విజయానికి పునాదులు…

Adolescent skills

 

లయన్ కొండా వేణుమూర్తి
విద్యార్థులకు సర్టిఫికేట్‌లు ప్రధానం

కరీంనగర్ : ప్రతి వ్యక్తి కౌమారక దశలో నేర్చుకొన్న నైపుణ్యాల ద్వారా జీవితంలో విజయతీరాలు చేరవచ్చునని లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ కొండ వేణుమూర్తి అన్నారు. శనివారం మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్వెస్ట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కౌమార దశలో పాఠశాల విద్యార్థులు అవసరమైన నైపుణ్యాలు, జీవన విలువలను అందించేందుకు లయన్స్ క్వెస్ట్ సంస్థ విశేష కృషి చేస్తున్నదని అన్నారు.

కౌమారదశ కౌశలాలను నేర్చుకొన్న యువత వ్యక్తిత్వం ఉజ్వలంగా ఉంటుందన్నారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతెడ్డి మాట్లాడుతూ… లయన్స్ క్వెస్ట్ శిక్షణ పొందిన యువకులు జీవన విధానంలోనే ప్రస్పుటమైన మార్పు కనిపిస్తుందని తెలిపారు. లయన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ ద్వారా పాఠశాలలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఉచిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా 600 మందికి పైగా విద్యార్థులు, యువత లాభపడ్డారన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్వెస్ట్ కౌమారదశ కౌశలాల శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్‌లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణరెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Adolescent skills are foundations of success

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కౌమారదశ నైపుణ్యాలు విజయానికి పునాదులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.