కథే థ్రిల్ చేస్తుంది

 

‘క్షణం’ సినిమాతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న అడివి శేష్ ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఎవరు’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మీడియా ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
థ్రిల్లర్ మూవీ…
‘క్షణం’ అందరినీ ఆకట్టుకున్న అద్భుతమైన థ్రిల్లర్ సినిమా. ఆ తర్వాత నేను చేసిన ‘అమీ తుమీ’ ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం. ‘గూఢచారి’లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అదొక యాక్షన్ డ్రామా. కాబట్టి ‘క్షణం’ తర్వాత నేను చేసిన పూర్తి థ్రిల్లర్ సినిమా ‘ఎవరు’.
ఖచ్చితంగా థ్రిల్ అవుతారు…
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. అసలు ఏం క్రైం జరిగింది? ఎవరు చేశారు? అనే నేపథ్యంలో కథ నడుస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు.
అంతా కథతోనే…
ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్‌తో థ్రిల్ అవ్వరు. కథే ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ‘గూఢచారి’ క్లైమాక్స్‌లో జగపతి బాబు క్యారెక్టర్ ట్విస్ట్‌లా కాకుండా కథతోనే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.
అతనే నా బెస్ట్ క్రిటిక్…
ఈ సినిమాను వెన్నెల కిషోర్‌కి చూపించాను. సినిమా చూసిన తర్వాత అతను నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. వెన్నెల కిషోర్ సినిమాల్లో సరదాగా కామెడీ చేస్తాడు. కానీ బయట సీరియస్‌గా ఉంటాడు. అతనికి సినిమాల మీద మంచి నాలెడ్జ్ ఉంది. నిజానికి అతనే నా బెస్ట్ క్రిటిక్. ప్రతిసారి అతని ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంటాను.
తదుపరి చిత్రాలు…
నేను చేయబోయే నెక్స్ సినిమా ‘మేజర్’ అక్టోబర్‌లో మొదలవుతుంది. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితంపై ఆ సినిమా రాబోతుంది. ఆ తర్వాత ‘గూఢచారి 2’ సినిమాను ప్రారంభిస్తాను.

Adivi Sesh Evaru movie interview

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కథే థ్రిల్ చేస్తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.