అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు

  మన తెలంగాణ/ ఉట్నూర్‌: అడవిపంది దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి) గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…  అచ్చంత్‌రావ్ రాత్రి సమయంలో గోదుమ పంటకు సాగునీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో తాను వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగానే ఆడవిపంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టు పక్కల రైతులు క్షతగాత్రుడిని స్థానిక ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ఎడమ చేతి, వీపు భాగంలో గాయాలయ్యాయని […] The post అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ ఉట్నూర్‌: అడవిపంది దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి) గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…  అచ్చంత్‌రావ్ రాత్రి సమయంలో గోదుమ పంటకు సాగునీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో తాను వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగానే ఆడవిపంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టు పక్కల రైతులు క్షతగాత్రుడిని స్థానిక ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ఎడమ చేతి, వీపు భాగంలో గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం అచ్చంత్‌రావ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నర్సపూర్(బీ) మాజీ సర్పంచ్ ఆనంద్‌రావు క్షతగాత్రున్ని పరమార్శించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

Adilabad Farmer injured in Pig attack in Farm Area

The post అడవిపంది దాడిలో రైతుకు తీవ్రగాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: