’ఆహా‘ టాక్ షో హోస్ట్ గా తమన్నా

Actress Tamanna Special Programme to Aha OTTహైదరాబాద్ : కరోనా లాక్ డౌన్ తో సిినిమా టాకీసులు మూతపడ్డాయి. దీంతో ఓవర్ ది టాప్ (ఒటిటి) వేదికలకు డిమాండ్ పెరిగింది. చాలా సినిమాలను ఒటిటిలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి తమన్నా త్వరలోనే ఒటిటి కోసం ఓ టాక్ షో చేయనున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ’ఆహా‘ పేరుతో ఒటిటిని ప్రారంభించిన విషయం నెటిజన్లకు తెలిసిందే. ’ఆహా‘ ఒటిటిపై తమన్నాతో ప్రత్యేకంగా ఓ టాక్ షో చేయించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమన్నాతో మాట్లాడారని సమాచారం. ’ఆహా‘ టాక్ షోకు హోస్టుగా చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టాక్ షోలో భాగంగా అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌, ర‌వితేజ త‌దిత‌ర  హీరోల‌తో పాటు పలువురు ప్రముఖ హీరోయిన్లు తమన్నా ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారని, త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై అల్లు అరవింద్ కానీ, తమన్నా కాని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ’ఆహా‘ టాక్ షో హోస్ట్ గా తమన్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.