వజ్రాల వ్యాపారంలోకి తమన్నా

మిల్కీబ్యూటీ తమన్నా ఓవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి  అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఖరీదైన వజ్రాల వ్యాపారం చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని  తమన్నా  అధికారికంగా ప్రకటించింది. వినాయక చవితి రోజున తన పేరుమీద కొత్త డైమండ్ జ్యూవెల్లరీ బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆమె పేర్కొంది. సౌత్‌లో ఏ స్టార్ హీరోయిన్ పేరు మీద కూడా జ్యూవెల్లరీ బ్రాండ్ లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు పలువురు జ్యూవెల్లరీ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. కానీ […]

మిల్కీబ్యూటీ తమన్నా ఓవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోకి  అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఖరీదైన వజ్రాల వ్యాపారం చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని  తమన్నా  అధికారికంగా ప్రకటించింది. వినాయక చవితి రోజున తన పేరుమీద కొత్త డైమండ్ జ్యూవెల్లరీ బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆమె పేర్కొంది. సౌత్‌లో ఏ స్టార్ హీరోయిన్ పేరు మీద కూడా జ్యూవెల్లరీ బ్రాండ్ లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు పలువురు జ్యూవెల్లరీ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. కానీ వారి పేరుపైన మాత్రం బ్రాండ్స్ లేవు. మొదటిసారి తమన్నా తన పేరుపై బ్రాండ్‌ను విడుదల చేస్తున్న కారణంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్2’ చిత్రంతో పాటు క్వీన్ రీమేక్ చిత్రంలో నటిస్తోంది.

Comments

comments

Related Stories: