ప్రేమలో నటి తాప్సీ

Actress Taapseeముంబయి : ప్రముఖ నటి తాప్సీ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 2010లో వచ్చిన ’ఝుమ్మంది నాదం’తో తాప్సీ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆమె చాలా తెలుగు సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఇదిలా ఉండగా తాప్సీ చాలా కాలం నుంచి ప్రేమలో ఉందన్న వార్తలు వచ్చాయి. తన ప్రేమపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది. తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అయితే తాను ప్రేమించే వ్యక్తి నటుడు, క్రికెటర్ కాదని,భారతీయుడు కూడా కాదని ఆమె స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకున్న తరువాతనే పిల్లలను కంటానని తాప్సీ స్పష్టం చేసింది. తన పెళ్లి నిరాడంబరంగా జరుగుతుందని, తన పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని ఆమె పేర్కొంది. తన ప్రేమపై ఇంత చెప్పిన తాప్సీ , పెళ్లి సమయం, వేదిక గురించి మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా తాప్సీ డెన్మార్క్ కు చెందిన  బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనాతో ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Actress Taapsee Is In Love

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రేమలో నటి తాప్సీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.