తల్లి అయ్యేందుకు సమంత ప్రణాళికలు

Samanthaహైదరాబాద్ : ప్రముఖ నటి సమంత వరుస విజయాలతో దూసుకెళుతోంది. హీరో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె కెరీర్ ఇంకా ముందుకు దూసుకెళుతోంది. సమంత నటించిన ‘ ఓ బేబి’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం సమంత 96 రీమేక్ సినిమాలో నటిస్తోంది. ఈ సిినిమాను తమిళంలో తీసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులోనూ తీస్తున్నారు. ఈ సినిమాకి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ కెమెరామెన్ గా కనిపించనున్నారు. ఈ నెల 16 నుంచి సినిమా మరో షెడ్యూలు మొదలుకానుంది. నవంబర్ లోపు సినిమా షూటింగ్ పూర్తి కానుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తరువాత కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇవ్వాలని సమంత భావిస్తోందట. ఈ సమయంలో మాతృత్వం పొందేందుకు సమంత ప్రణాళికలు తయారు చేసుకుంటుందని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మాతృత్వం పొందే విషయంపై సమంత మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

Actress Samantha Plans To Become Mother

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తల్లి అయ్యేందుకు సమంత ప్రణాళికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.