రమ్యకృష్ణ జాతకాలు కూడా చెబుతుందట…

హైదరాబాద్  : ప్రముఖ నటి రమ్యకృష్ణ చెయ్యి చూసి జాతకాలు కూడా చెబుతుందట. ప్రస్తుతం ఆమె తమిళ , తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఎటువంటి పాత్రనైనా పోషించి తన సత్తా చాటుతున్న రమ్యకృష్ణ చెయ్యి చూసి జాతకాలు చెబుతుందన్న విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదట. రమ్యకృష్ణ జాతకాలు చెబుతుందన్న విషయాన్ని సీనియర్ జర్నలిస్టు బికె ఈశ్వర్ వెల్లడించారు. అలనాటి నటి భానుమతి మాత్రమే చెయ్యి చూసి జాతకాలు చెప్పేవారని, అయితే రమ్యకృష్ణ కూడా […] The post రమ్యకృష్ణ జాతకాలు కూడా చెబుతుందట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్  : ప్రముఖ నటి రమ్యకృష్ణ చెయ్యి చూసి జాతకాలు కూడా చెబుతుందట. ప్రస్తుతం ఆమె తమిళ , తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఎటువంటి పాత్రనైనా పోషించి తన సత్తా చాటుతున్న రమ్యకృష్ణ చెయ్యి చూసి జాతకాలు చెబుతుందన్న విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదట. రమ్యకృష్ణ జాతకాలు చెబుతుందన్న విషయాన్ని సీనియర్ జర్నలిస్టు బికె ఈశ్వర్ వెల్లడించారు. అలనాటి నటి భానుమతి మాత్రమే చెయ్యి చూసి జాతకాలు చెప్పేవారని, అయితే రమ్యకృష్ణ కూడా చెయ్యి చూసి జాతకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఆయన పేర్కొన్నారు. రమ్యకృష్ణకు జాతాలు చెప్పొచ్చో, రాదో తెలుసుకునేందుకు ఈశ్వర్ తన జాతం చెప్పాలని, తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో, ఎంత మంది పిల్లలు పుడుతారో చెప్పాలని ఆయన కోరారట. అయితే ఈశ్వర్ జాతకం చూసి, తనను పరీక్షించేందుకు ఇలా చేశారా అని ఆమె ఆయన్ను ప్రశ్నించిందట. మీకు పెళ్లి జరిగిందని, ముగ్గురు పిల్లలకు కూడా ఉన్నారని రమ్యకృష్ణ ఈశ్వర్ చెయ్యి చూసి చెప్పడంతో ఈశ్వర్ ఖంగుతిన్నారట. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ చెయ్యి చూసి జాతకాలు చెప్పడంలో సిద్ధహస్తురాలని తనకు అప్పుడు అర్థమైందని ఈశ్వర్ ఒకానొక సందర్భంలో తెలిపారు.

Actress Ramya Krishna Says Horoscope

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రమ్యకృష్ణ జాతకాలు కూడా చెబుతుందట… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: