భారీగా పారితోషికం పెంచిన నయనతార

హైదరాబాద్ : తెలుగు, తమిళ సినిమాల్లో అగ్రహీరోయిన్ గా పేరున్న లేడీ సూపర్ స్టార్ నయనతార తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు భాషల్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉందన్న విషయం విదితమే. స్టార్ హీరోలతో పాటు వర్థమాన హీరోలతో కూడా నయన్ జత కడుతోంది. అంతేకాదు నాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. ఏ పాత్ర చేసినా, అందులో లీనమై పోవడం ఆమెకు వెన్నతో పెట్టి […] The post భారీగా పారితోషికం పెంచిన నయనతార appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలుగు, తమిళ సినిమాల్లో అగ్రహీరోయిన్ గా పేరున్న లేడీ సూపర్ స్టార్ నయనతార తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు భాషల్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉందన్న విషయం విదితమే. స్టార్ హీరోలతో పాటు వర్థమాన హీరోలతో కూడా నయన్ జత కడుతోంది. అంతేకాదు నాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. ఏ పాత్ర చేసినా, అందులో లీనమై పోవడం ఆమెకు వెన్నతో పెట్టి విద్యగా మారింది. దీంతో ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎగబడుతారు. ఇటీవల వరకు నయనతార పారితోషికంగా రూ. 4 కోట్ల వరకు తీసుకునేదట. అయితే తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి ప్రస్తుతం ఆమె రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు అంతమొత్తం పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. నయనతార అందుకుంటున్న పారితోషికాన్ని చూసి తోటి హీరోయిన్లు ఆశ్చర్యపోతున్నారు.

Actress Nayanthara Remuneration Increased

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారీగా పారితోషికం పెంచిన నయనతార appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: