తెలుగు నేర్చుకుంటున్నాను….

మహబూబ్‌నగర్, వనపర్తి కి చెందిన అదితిరావు హైదరి తెలుగమ్మాయే. అయినా పేరు మాత్రం తెలుగు పేరులా ఉండదు. ఆమె తల్లి వనపర్తి సంస్థానానికి చెందిన జె.రామేశ్వర్ రావు కుమార్తె అదితి అక్బర్ హైదరి మునిమనుమరాలు. అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్‌కు మనవరాలు. సినీ నిర్మాత, అమీర్‌ఖాన్ భార్య కిరణ్‌రావుకు అదితి కజిన్ అవుతుంది. వనపర్తి సంస్థానాధీశుడు రాజా జె.రామేశ్వరరావు, శాంతా రామేశ్వరరావులు అదితికి తాతయ్య, అమ్మమ్మలు. చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలన్నదే ఆమె కోరిక. […]

మహబూబ్‌నగర్, వనపర్తి కి చెందిన అదితిరావు హైదరి తెలుగమ్మాయే. అయినా పేరు మాత్రం తెలుగు పేరులా ఉండదు. ఆమె తల్లి వనపర్తి సంస్థానానికి చెందిన జె.రామేశ్వర్ రావు కుమార్తె అదితి అక్బర్ హైదరి మునిమనుమరాలు. అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్‌కు మనవరాలు. సినీ నిర్మాత, అమీర్‌ఖాన్ భార్య కిరణ్‌రావుకు అదితి కజిన్ అవుతుంది. వనపర్తి సంస్థానాధీశుడు రాజా జె.రామేశ్వరరావు, శాంతా రామేశ్వరరావులు అదితికి తాతయ్య, అమ్మమ్మలు. చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలన్నదే ఆమె కోరిక. చిన్నప్పటి నుంచీ ఎక్కువగా మణిరత్నం సినిమాలు చూసేదట. సమ్మోహనం సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు మాట్లాడటం నేర్చుకుంటుందట. వరుణ్‌తేజ్ హీరోగా రాబోతున్న సినిమాలో ఆస్ట్రోనాట్ గా నటిస్తోంది ప్రస్తుతం.

పుట్టింది : 1986 అక్టోబరు 28
వయస్సు : 31 సంవత్సరాలు
జీవిత భాగస్వామి: సందీప్ మిశ్రా
తల్లిదండ్రులు: అమ్మ విద్యారావ్, నాన్న ఇషాన్ హైదరి
చదువు : ఆంధ్రప్రదేశ్ మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో సోషియాలజీలో పీజీ.
జాతీయత: భారతీయురాలు
ఇష్టమైన కళలు: భరతనాట్యం
తెరంగేట్రం : చెలియా, సమ్మోహనం, పద్మావత్ సినిమాలో మెహరున్నీసా పాత్ర. తమిళంలో శృంగారం. మలయాళంలో ప్రజాపతి మమ్ముట్టి సరసన దేవదాసీ పాత్ర. ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది.
ఆమె నటించిన రాక్ స్టార్ (2011), మర్డర్3 (2013), ఖూబ్ సూరత్ (2014), వాజిర్ (2016), ఫితూర్ (2016) వంటి సినిమాలు విజయవంతయయ్యాయి.
మర్చిపోలేని సంఘటన: బిగ్‌బీ అమితాబ్ సార్ ప్రశంస నేను ఎప్పటికీ మర్చిపోలేను. ‘నిన్ను తెరమీద చూస్తున్నప్పుడు తల తిప్పుకోలేం అని చెప్పారు. పద్మావత్ సినిమా విడుదలయ్యాక నటి రేఖ మెచ్చుకుని లేఖ రాశారు” అంటోంది.
అవార్డులు: స్క్రీన్ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారం లభించింది.

Comments

comments

Related Stories: