కాంగ్రెస్‌కు నటి ఊర్మిళ రాజీనామా

ముంబయి : రాజకీయాల్లోకి వచ్చిన సినీనటి ఊర్మిళా మాతోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం తెలిపారు. పార్టీ లో అల్పమైన కుటుంబ రాజకీయాలే రాజీనామాకు కారణమని ఆరు నెలల కిందట మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ నుంచి మొదటిసారి పోటీచేసిన ఊర్మిళకు ఆరు సెగ్మెంట్లలో 2,41,431 ఓట్లు వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న […] The post కాంగ్రెస్‌కు నటి ఊర్మిళ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


ముంబయి : రాజకీయాల్లోకి వచ్చిన సినీనటి ఊర్మిళా మాతోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం తెలిపారు. పార్టీ లో అల్పమైన కుటుంబ రాజకీయాలే రాజీనామాకు కారణమని ఆరు నెలల కిందట మార్చిలో కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ నుంచి మొదటిసారి పోటీచేసిన ఊర్మిళకు ఆరు సెగ్మెంట్లలో 2,41,431 ఓట్లు వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో పార్టీని సమైక్యపరిచి, పటిష్టం చేసుకునేందుకు అవస్థపడుతున్న కాంగ్రెస్‌కు ఊర్మిళ రాజీనామా మింగుడు పడని అంశంగా మారింది. ఇబ్బందికరంగా తయారైంది. ‘నా రాజకీయ, సామాజిక విశ్వాసాలు పార్టీలో కొందరి స్వప్రయోజనాలకు విరుద్ధం. ఉన్నత మైన లక్షం కోసం పనిచేయడానికి బదులు ముంబయి కాంగ్రెస్ అల్పమైన కుటుంబ రాజకీయాలకు నన్ను పావులా వాడుకోవాలని చూస్తోంది’ అని మాతోండ్కర్ ఆరోపించారు.

Actor Urmila Matondkar resigns from Congress

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాంగ్రెస్‌కు నటి ఊర్మిళ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: