పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటండి : నటుడు శివారెడ్డి

Actor Shiva Reddy Participated In Green India Challengeహైదరాబాద్ : టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తుందని ఆయన చాలెంజ్ ను స్వీకరించి ఎంతో మంది ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలోనే నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మణికొండలోని తన నివాసంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తాను భాగస్వామి కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ చాలెంజ్ ను ప్రారంభించడం హర్షించతగ్గ విషయమని, ఆయన బాటలో ప్రతి ఒక్కరు సాగి విరివిగా మొక్కలు నాటాలని ఆయన పేర్కొన్నారు. తనకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను విసిరిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ నటుడు అలీ, కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలహాసన్ రెడ్డి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత కాసర్ల శ్యామ్, కళాకారుడు సంపత్ కు శివారెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్ ను విసిరారు. తాను చేసిన చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన కోరారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటండి : నటుడు శివారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.