’తలైవి’లో కరుణానిధిగా ప్రకాశ్ రాజ్

చెన్నయ్ : తమిళనాడు మాజీ సిఎం, దివంగత జయలలిత జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఈ సినిమాకు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటిస్తున్నారు. ఎంజిఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా జయలలిత, కరుణానిధి తమ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘తలైవి’ సినిమాలో కరుణానిధి పాత్ర కూడా ఉంటుంది. […] The post ’తలైవి’లో కరుణానిధిగా ప్రకాశ్ రాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : తమిళనాడు మాజీ సిఎం, దివంగత జయలలిత జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఈ సినిమాకు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటిస్తున్నారు. ఎంజిఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా జయలలిత, కరుణానిధి తమ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘తలైవి’ సినిమాలో కరుణానిధి పాత్ర కూడా ఉంటుంది. దీంతో ఆ పాత్ర కోసం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 22 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్’ సినిమాలో ప్రకాశ్ రాజ్ నటించారు. తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో విడుదలైన ఈ సినిమా కథ ఎంజిఆర్, కరుణానిధిలదేనని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే మణిరత్నం మాత్రం దీనిపై స్పందించలేదు. ‘ఇరువర్’ సినిమాలో కరుణానిధి పాత్రలో నటించిన ప్రకాశ్ రాజ్ తిరిగి 22 ఏళ్ల తరువాత ఆయన పాత్రలోనే మరోసారి నటించడం విశేషమని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Actor Prakash Raj Act As Karunanidhi In Thalaivi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ’తలైవి’లో కరుణానిధిగా ప్రకాశ్ రాజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: