దేశభక్తి నేపథ్యంలో మోహన్ బాబు ’సన్ ఆఫ్ ఇండియా‘

Actor Mohan Babu Son Of India Title Poster Releaseహైదరాబాద్  : దేశ భక్తి నేపథ్యంలో డాక్టర్ మోహన్ బాబు ’సన్ ఆఫ్ ఇండియా‘ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 74వ స్వాతంత్ర దిన వేడుకలను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోహన్ బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ లో అశోక చక్రం, బ్యాగ్రౌండ్ లో ఇండియా చిత్రపటం కనిపిస్తోంది. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు గతంలో దివంగత నటుడు, మాజీ సిఎం ఎన్ టిఆర్ ప్రధాన పాత్రలో మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేవం వంటి సందేశాత్మక సినిమాలను తీసిన విషయం తెలిసిందే. ’సన్ ఆఫ్ ఇండియా‘కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దేశభక్తి నేపథ్యంలో మోహన్ బాబు ’సన్ ఆఫ్ ఇండియా‘ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.