మొక్కలు నాటిన నటుడు అలీ

Actor Ali Participated In Green India Challengeహైద‌రాబాద్ : టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన లభిస్తోంది. ఆయన చాలెంజ్ ను స్వీకరించి పలు రంగాలకు చెందిన ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. నటుడు శివారెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి హాస్యనటుడు అలీ శనివారం మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా అలీ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు అలీ ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలీ తన సోదరుడు , నటుడు ఖయుమ్, తన బావమరిది కరీంలకు  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఈ ఇద్దరు మొక్కలు నాటాలని ఆయన కోరారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మొక్కలు నాటిన నటుడు అలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.