నటి సాయి పల్లవితో డేటింగ్‌: స్పందించిన విజయ్

చెన్నై: తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌, నటి సాయి పల్లవి డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అమలా పాల్‌ మాజీ భర్త అయిన విజయ్‌.. సాయి పల్లవి నటించిన ‘కణం’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై విజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడుతూ… సాయి పల్లవి […]

చెన్నై: తమిళ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌, నటి సాయి పల్లవి డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అమలా పాల్‌ మాజీ భర్త అయిన విజయ్‌.. సాయి పల్లవి నటించిన ‘కణం’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై విజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడుతూ… సాయి పల్లవి తనకి మంచి స్నేహితురాలని ,మున్ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన అంతకన్నా లేదని, ఇలాంటి తప్పుడు వదంతులు క్రియేట్ చేయకూడదని అన్నారు. ఇలాంటి వదంతుల వల్ల రెండు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. సాయి పల్లవి కూడా ఈ వార్తలపై స్పందిస్తూ.. తన గురించి అర్థంలేని విషయాలు రాస్తే మీడియా వర్గాలపై దావా వేస్తానని అన్నట్లు సమాచారం.

 

Actor AL Vijay Responding On  Actress Sai Pallavi dating


Related Stories: