అదంతా నటనలో భాగమే

Acting naked is all part of acting

 

శర్వానంద్‌కి జోడీగా ‘రాజు మహారాజు’ అనే సినిమాలో ఆడిపాడిన భామ సుర్వీన్ చావ్లా. ఆ సినిమా ప్లాప్‌తో తెలుగులో మళ్లీ కనిపించలేదు ఈ బ్యూటీ. అయితే చిత్ర పరిశ్రమలో సంచలన కామెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే తమ కెరీర్‌ను కొనసాగిస్తారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సమంత, శ్రియా లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తున్నారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలా ఉండదు. అక్కడ పెళ్లికి, నటనకు అస్సలు సంబంధం ఉండదు. నటన, – వివాహం అస్సలు సంబంధం లేని అంశాలు అంటారు బాలీవుడ్ వయ్యారి భామలు. సినిమాలో ఎలా నటించినా అంతా నటనలో భాగమే అనుకుంటారు తప్ప నిజమనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. అందుకే రాధికా ఆప్టే, – సన్నీ లియాన్ తదితరులు ఇప్పటికీ సినిమాల్లో హాట్ హాట్‌గా నటిస్తున్నారు.

ఈ భామలు శృంగార సన్నివేశాలను కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అయితే వారు అలాంటి సన్నివేశాలను అంత సులభంగా చేస్తున్నారంటే అందులో భర్తల ప్రోత్సాహమే కారణం అని చెప్పాలి. అలా పెళ్లయిన తర్వాత కూడా సుర్వీన్.. ‘హేట్ స్టొరీ 2’ సినిమాలో రెచ్చిపోయి నటించి బాలీవుడ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అందులో చేసిన శృంగార సన్నివేశాలు, – అందాల ప్రదర్శనతో ఈ అమ్మడిపై బాలీవుడ్ దృష్టి పెట్టింది. ఎన్ని అవకాశాలు వచ్చినా.. అమ్మడు చేస్తున్న సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలే కావడం విశేషం. ఇక ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత మరిన్ని శృంగార భరిత సినిమాలు చేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ తాను నగ్నంగా నటించినా తన భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పరని… – అదంతా నటనలో భాగంగా చూస్తారని చెప్పింది. అందుకే నేను ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అదంతా నటనలో భాగమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.