నిందితున్ని కఠినంగా శిక్షించాలి…

  వరంగల్  : తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన దారుణ ఘటనపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శనివారం హన్మకొండలోని టైలర్‌స్ట్రీట్‌లోని పాలజెండాలో శ్రీహిత హత్యకు నిరసనగా భారీ ఎత్తున ప్రజలు, మహిళా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అశోక జంక్షన్‌లో మానవహారం చేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా మధ్యలోనే ఏకశిల పార్క్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. […] The post నిందితున్ని కఠినంగా శిక్షించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్  : తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన దారుణ ఘటనపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శనివారం హన్మకొండలోని టైలర్‌స్ట్రీట్‌లోని పాలజెండాలో శ్రీహిత హత్యకు నిరసనగా భారీ ఎత్తున ప్రజలు, మహిళా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అశోక జంక్షన్‌లో మానవహారం చేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా మధ్యలోనే ఏకశిల పార్క్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ… శ్రీహిత హత్య చేసిన నిందితున్ని వెంటనే బహిరంగ ప్రదేశంలో ఎన్‌కౌంటర్ చేయాలని, లేకపోతే ఉరితీయాలన్నారు. ఈ ధర్నా, రాస్తారోకోలో నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. యాంకర్ నానియాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి వందలాది మంది విద్యార్థిని, విద్యార్థులు వందలాదిగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సిఎంగా ఉన్నప్పుడు యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని, అలాగే బంగారు తెలంగాణ కోసం పాటుపడే సిఎం కెసిఆర్ కూడా అలాగే నిందితున్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. ఈ ధర్నాలో శ్రీహిత తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు
తొమ్మిది నెలల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ప్రవీణ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సిసి టివిలో ప్రవీణ్ అరాచకాలకు సంబంధించిన వీడియోలను పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడు ప్రవీణ్ రాత్రుల్లో కాలనీలను టార్గెట్ చేయడమే కాకుండా, ఆరు బయట పడుకునే మహిళలనే టార్గెట్ చేస్తూ ఉండేవాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

వింత, వికృత చేష్టలతో మహిళలను బాధపెట్టేవారని తేలింది. అంతేకాకుండా ఆయనకు భయపడి కాలనీలనే ఖాళీలు చేసే వారని తెలుస్తోంది. ఒకవేళ వారు బయటికి వస్తే తమకే ఇబ్బంది అన్న ఉద్దేశంతో బాధితులెవ్వరూ బయటకు రాలేదని అంటున్నారు. ఒకరకంగా మాత్రం రిమాండ్ రిపోర్టులో ప్రవీణ్‌ని సెక్స్ మానియా అని కేవలం అర్ధ రాత్రుల్లో మాత్రమే ఇలాంటి కార్యకలాపాలు చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. బయట పడుకునే మహిళలపై సిరంజీలో నీళ్లు నింపి వారిపై చల్లడంతో పాటు చాలా వికృత చేష్టలకు పాల్పడేవారని పోలీసులు రిపోర్టులో పేర్కొంటున్నారు.

హోంమంత్రికి ఎంఎల్‌ఎ వినతి
చిన్నారి శ్రీహితను క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడు పోలెపాక ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహముద్‌అలీకి వినతిపత్రం ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని హోంమినిస్టర్ కార్యాలయానికి వెళ్లి తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని శ్రీహితను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి క్రూరంగా హత్యచేసిన ఈ హృదాయ విదారక సంఘటన తనను ఎంతో కలిచి వేసిందని హోంమంత్రికి తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌కు కఠిన శిక్ష వేయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రితో మాట్లాడుతూ మంత్రి దయాకర్‌రావుతో కలిసి శ్రీహిత తల్లిదండ్రులను కలిసి ఓదార్చినట్లు నిందితున్ని కఠిన శిక్ష పడేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంఎల్‌ఎ తెలిపారు. నిందితున్ని కఠినంగా శిక్షించడానికి చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని, ఈకేసులో వేగవంతంగా దర్యాప్తు చేపట్టి శిక్ష పడేటట్లు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్ చేసే విషయంపై ప్రతిపాదనలు చేయాలని వరంగల్ పోలీసు కమిషనర్‌కు హోంమంత్రి మహమ్మద్ మహ్ముద్ ఆలీ ఆదేశించారు.

Accused should be Punished Harshly

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిందితున్ని కఠినంగా శిక్షించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.