కాళ్లు పట్టుకున్నా కనికరించలేదట!

Accused is Suresh's wife Latha

 

భూమి విషయంలో న్యాయం కోసం వెళ్తే లంచం అడిగిందని చెప్పాడు : తహసీల్దార్ విజయారెడ్డి నిందితుడు సురేష్ భార్య లత

అబ్దుల్లాపూర్‌మెట్ : తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో మృతి చెందిన ప్రధాన నిందుతుడి సురేష్ అంత్యక్రియలు జరిగిన తర్వాత భార్య లత పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భూమి విషయంలో న్యాయం కోసం వెళితే లంచం అడిగారని సురేష్ చికిత్స సమయంలో ఆసుపత్రిలో భార్య లతతో చెప్పిన మాటలను శుక్రవారం మీడియా ముందు వెల్లడించింది. అప్పులు ఉన్నాయి కదాని భూమిని అమ్ముకుని తీర్చాలను కున్నాడని తెలిపింది. కాని భూమి తన పేరు మీద లేకపోవడంతో చాలా సార్లు తహసీల్దార్‌ను కలిపి విజ్ఞప్తి చేశాడని, మారోసారి తహసీల్దార్‌తో తన పేర్ల మీద పేపర్లు చేయించుకోవాలని వెళితే లంచం అడిగిందని ఆమె తెలిపింది.

తన వద్ద ఇప్పడు డబ్బులు లేవని అప్పులు చాలా ఉన్నాయని, ఇల్లు అమ్మి ఇస్తానని కాళ్లు పట్టుకున్నా ఒప్పుకోలేదని ఆమె వాపోయింది. బెదిరిద్దామని పెట్రోల్ మీద పోసుకున్నా కనికరించ లేదని తెలిపింది. తర్వాత ఏం జరిగిందో చెప్పలేదని అప్పటికే సురేష్‌కు నోటిమాటలు బంద్ అయిపోయాయని పేర్కొంది. భూమి కోసం డబ్బులు ఇచ్చిన్నట్లు చెప్పాడని, ఎవరికి ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో తెలియదని లత తెలిపింది. రూ.9- లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు భూమి విషయంలో ఏవరికో ఇచ్చి ఉండవచ్చని తెలిపింది. ఒక్క పక్కన అప్పులు, మారోపక్క భూమి తమ పేర్ల మీద కావడం లేదని కుంగిపోయేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.

భూమి కోసం దిగులు పడేవాడు : తండ్రి
తాతల కాలం నుంచి ఉన్న భూమి వివాదాస్పదం కావడంతో దిగులుతో బాధపడుతుండే వాడని కూర సురేష్ తండ్రి కూర కృష్ణ తెలిపారు. మా తండ్రి కూర వెంటయ్య పేరు మీద పాసుబుక్ కూడా ఉందని 1950 నుంచి భూమి సాగుచేసుకుంటున్నామని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కొంత భూమిపోతే నష్టపరిహారం అందించారని తెలిపారు. తమకు ఉన్న భూముల్లో 8 గుంటలు మల్‌రెడ్డి రాంరెడ్డికి, జైపాల్‌రెడ్డికి న్యాయబద్ధ్దంగా అమ్మిన్నామని తెలిపారు. అయితే మిగతా భూమి విషయంలో అధికార్లు వివాదం సృష్టించి తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. తామకు పాస్‌బుక్ ఉన్నా అధికార్లు రికార్డుల్లో పేర్లు తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కారులోని వ్యక్తుల గుర్తింపు?
హత్య కేసులో కీలకంగా మారిన కారులోని వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు, సిసిటివి ఫుటే జి ఆధారంగా కారులోని వ్యక్తులను గుర్తించినట్లు సమాచారం. ఎంఆర్‌ఒ విజయారెడ్డిపై దాడి తర్వాత నిందితు డు సురేశ్ బయటకు వచ్చిన అనంతరం వైన్ షాపు వద్ద ఉన్న కారులోని వ్యక్తులతో మాట్లాడినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తర్వాత కారు ఎటు వెళ్లిందనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. కారులోని వ్యక్తులను విచారిస్తే కొత్త విషయాలు బయట కు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Accused is Suresh’s wife Latha comments on Vijaya reddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాళ్లు పట్టుకున్నా కనికరించలేదట! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.