సముద్ర అంతర్గత ఉష్ణోగ్రతపై రుతు పవనాల కచ్చిత అంచనా

రుతుపవనాల సమయంలో ఏమాత్రం వర్షం కురుస్తుందో ముందుగా అంచనా వేయడానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను (ఎస్‌ఎస్‌టి) పరిగణలోకి తీసుకోవడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా వస్తోంది. సుదీర్ఘకాల ప్రమాణం 8875 మీ.మీ, కన్నా ఎక్కువా లేక తక్కువా ఎంత కురుస్తోందో  అంచనా వేయడానికి  ఎస్ ఎస్ టి పద్ధతిని పాటిస్తుంటారు. అయితే ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కొలమానం కన్నా సముద్ర అంతర్గత ఉష్ణోగ్రతల (ఓషన్ మీన్ టెంపరేబర్ ఒఎంటి) కొలమానమే కచ్ఛితంగా  అంచనా వేయగలుగుతుందని పునె ఇండియన్ […]

రుతుపవనాల సమయంలో ఏమాత్రం వర్షం కురుస్తుందో ముందుగా అంచనా వేయడానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను (ఎస్‌ఎస్‌టి) పరిగణలోకి తీసుకోవడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా వస్తోంది. సుదీర్ఘకాల ప్రమాణం 8875 మీ.మీ, కన్నా ఎక్కువా లేక తక్కువా ఎంత కురుస్తోందో  అంచనా వేయడానికి  ఎస్ ఎస్ టి పద్ధతిని పాటిస్తుంటారు. అయితే ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కొలమానం కన్నా సముద్ర అంతర్గత ఉష్ణోగ్రతల (ఓషన్ మీన్ టెంపరేబర్ ఒఎంటి) కొలమానమే కచ్ఛితంగా  అంచనా వేయగలుగుతుందని పునె ఇండియన్ ఇనిస్టిట్యూ ఆఫ్ ట్రాపికల్ మెటియొరాలజీ (ఐ ఐ టిఎం) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎస్ ఎస్ టి ఒఎంటి విధానాల మధ్య పోలికలను విశ్లేషిస్తూ ఎస్ ఎస్ టి వల్ల 60 శాతం సత్ఫలితాల రేటు సాధిస్తుండగా, ఒ ఎంటి వల్ల 80 శాతం సత్ఫలితాల రేటు లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతే కాక కచ్ఛితంగా అంచనా వేయడానికి సుదీర్ఘకాల ప్రమాణం మేరకు  వర్షం ఎంత పడుతుందో ఏప్రిల్ ప్రాంభంలోనే సమాచారం లభిస్తుంది. అంటే నైరుతి పవనాలు రావడానికి రెండు నెలల ముందుగా తెలుస్తుంది. ఇదెందుకంటే సముద్ర వేడి శక్తిని జనవరి మార్చి మధ్యకాలంలో కొలవడం ద్వారా సముద్ర అంతర్గత ఉష్ణోగ్రతలు(ఒఎంటి) ను విశ్లేషించడమవుతుంది.

ఏటా కేరళలో జూన్‌నెలలో నైరుతి పవనాలు ఏర్పడుతుంటాయి. సముద్రం పైన ఆవరించిన పలుచని పొర తాలూకు సమాచారాన్నే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు (ఎస్‌ఎస్‌టి) అందిస్తాయి. తప్ప సముద్రంలో దాగి ఉన్న వేడిని ప్రతిబింబించవు. సముద్రంపై ఆవరించిన వేడి శక్తి పరిస్థితుల తేడాలే ప్రధానంగా వేసవి రుతుపవనాలకు కారణమవుతుంటాయని  ఐఐటిఎమ్ సీనియర్ సైంటిస్టు ఎంఎం అలి చెప్పారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కన్నా సముద్రంలోని వేడి శక్తి తీవ్రతే రుతుపవనాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని, ఉపరితల ఉష్ణోగ్రత ఉపరితలానికే పరిమితమవుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శెక్రటరీ ఎం. రాజీవన్ వెల్లడించారు. ఈ అథ్యయన నివేదికలో ఆయన పాలు పంచుకొంటున్నారు. సముద్రంపై ఉన్న పొరకే ఉపరితల ఉష్ణోగ్రత కొన్ని మిల్లీ మీటర్ల మేరకు పరిమితమవుతుంది. బలలమైన గాలులకు, ఆవిరి, లేదా దట్టమైన మబ్బులకు బాగా ప్రభావితమవుతుంది. దీనితో పోలిక లేకుండా సముద్రంలో 26 డ్రిగీల సి ఐసో ధెర్మ్ లోతు వరకు సముద్ర అంతర్గత ఉష్ణోగ్రతలను కొలవడమవుతుంది. చాలా సుస్థిరంగా, సమగ్రంగా ఈ ఉష్ణోగ్రత ఉంటుంది. సమ్రుదంలో 50 నుంచి 100 మీటర్ల వరకు ఎక్కువ తక్కువ లోతు బట్టి 26 డిగ్రీల ఐసోధెర్మ్ కనిపిస్తుంది. జనవరి మార్చి మధ్యకాలంలో నైరుతి హిందూ సమ్రుదంలో 59 మీటర్ల లోతులో 26 డిగ్రీల ఐసోధెర్మ్ కనిపిస్తుంది.

పరిశోధకులు 1993 నుంచి 2017 వరకు 25 ఏళ్లకు సంబంధించి ఒఎంటి డేటాను విశ్లేషించారు. ఎస్ ఎస్ టి వలె కాకుండా ఒఎంటి 25ఏళ్లలో 20 ఏళ్లు కచ్ఛితంగా అంచనా వేయగలిగింది.( 80 శాతం సత్ఫలితాలు), ఇదే విధంగా ఎస్ ఎస్ ఫలితాలను విశ్లేషించగా 25 ఏళ్లలో 15 ఏళ్లు మాత్రమే కచ్చితంగా అంచనాలు వెలువడ్డాయి. అంటే 60 శాతం సత్ఫలితాలు వచ్చాయి. 2018 జనవరి  మార్చి మధ్యకాలం నాటి ఒఎంటి డాటాను ఉపయోగించి ఈ ఏడాది రుతుపవనాలను 80 శాతం వరకు అంచనా వేయ గలిగామని జూన్ సెప్టెంబర్ మధ్యకాలంలో రుతుపవనాలు సరాసరి కన్నా తక్కువ స్థాయిలో ఉంటాయని డాక్టర్ అలి పేర్కొన్నారు. అదే విధంగా ఎస్ ఎస్ టి తో పోల్చుకుంటే వర్షపాత సంవత్సరాల్లో  సరాసరి కన్నా ఎక్కువ లేదా తక్కువ వర్షపాతం అంచనా వేయడంలో ఒఎంటి చాలా మెరుగైన సత్ఫలితాలు అందించింది.

1993 2017 మధ్యకాలంలో 16 లో 13 సంవత్సరాలు సరాసరి కన్నా ఎక్కువ వర్షపాతంగా ఒఎంటి అంచనా కచ్చితంగా వేయగలిగింది. దీనికి భిన్నంగా ఎన్‌ఎన్‌టి ఆధార అంచనాలు 16 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మాత్రమే సరాసరి కన్నా తక్కువ వర్షపాత సంవత్సరాలుగా 9 ఏళ్లలో 5ఏళ్లు  సరాసరి కన్నా ఎక్కువ వర్షపాత సంవత్సరాలుగా వెలువడ్డాయి. ఎస్‌ఎస్‌టి కన్నా ఒఎంటి అంచనాలు ఎందుకు కచ్చితంగా ఉంటున్నాయి. అంటే సముద్రంపై ఆవరించిన వేడి పరిస్థితులను ఒఎంటి కచ్ఛితంగా అంచనా వేయగలుగుతోంది. ఈ పరిస్థితుల్లో తేడాలు వేసవి రుతుపవనాలకు ప్రధాన కారణమవుతున్నాయి. అత్యంత వేగంగా వేడి అయినా లేదా చల్లదనం అయినా సముద్రంపై ఆవంచిన పొర తాలుకు ఉష్ణోగ్రతకు సముద్రంలో మీది భాగాన ఉన్న వేడికి చెప్పుకోదగినంత  తేడా కనిపిస్తోంది. దీని వల్ల రుతుపవనాల అంచనాలు గాడి తప్పుతున్నాయని డాక్టర్ అలి వివరించారు.

Comments

comments

Related Stories: