మా కొడుకు ఎందుకు చంపాడో తెలియదు…

MRO Murder

హైదరాబాద్ : ఎంఆర్‌ఒ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందడంతో మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం ఉస్మానియా వైద్యులు సురేష్ మృత దేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడు సురేష్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ స్పందించారు. తన కొడుకు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదని, తహశీల్దారును ఎందుకు హత్య చేశాడో తమకు తెలీదని అన్నారు.

తమకు చెందిన తొమ్మిది గుంటల భూమిని ఏడాది క్రితం మల్‌రెడ్డి రంగారెడ్డికి అమ్మినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఏడు ఎకరాలు భూమి తమ అన్నదమ్ములకు చెందినది ఉందని, అయితే భూ సమస్య నిమిత్తం తానే తహశీల్దార్ ఆఫీసు, కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణ తెలిపారు. తమ కుమారుడు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. గురువారం రాత్రే అంత్యక్రియలను పూర్తి చేస్తామని నిందితుడు సురేష్ తండ్రి కృష్ణ పేర్కొన్నారు.

Abdullapurmet MRO Vijaya Reddy Murder

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మా కొడుకు ఎందుకు చంపాడో తెలియదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.