కరోనాను ఎదుర్కోవడంలో ఏబిసిడిఈ విటమిన్లదే ముఖ్యపాత్ర

  హైదరాబాద్ : కరోనా వైరస్ తక్కువ కాలంలో మనిషిలోని ముఖ్య అవయవాలపై ప్రభావం చూపుతోంది. ఆక్సిజన్ ప్రసరింప జేసే ముఖ్యమైన ఊపిరితిత్తులు, అవయవాలతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె వంటి అవయవాలు కూడా ఈ వైరస్ వలన బలహీనమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని ఆహార నియమాలు పాటిస్తే శరీరంలో వైరస్‌ని ఎదుర్కొగల రోగనిరోధక శక్తిని పెరుగుతుందని దీంతో వైరస్ మన దరిచేరదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌తో పోరాడేందుకు మనకు విటమిన్లు A, […] The post కరోనాను ఎదుర్కోవడంలో ఏబిసిడిఈ విటమిన్లదే ముఖ్యపాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : కరోనా వైరస్ తక్కువ కాలంలో మనిషిలోని ముఖ్య అవయవాలపై ప్రభావం చూపుతోంది. ఆక్సిజన్ ప్రసరింప జేసే ముఖ్యమైన ఊపిరితిత్తులు, అవయవాలతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు, గుండె వంటి అవయవాలు కూడా ఈ వైరస్ వలన బలహీనమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని ఆహార నియమాలు పాటిస్తే శరీరంలో వైరస్‌ని ఎదుర్కొగల రోగనిరోధక శక్తిని పెరుగుతుందని దీంతో వైరస్ మన దరిచేరదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌తో పోరాడేందుకు మనకు విటమిన్లు A, B, C, D, E తో పాటు మినరల్స్ ఐరన్, సెలెనియం, జింక్ తప్పనిసరిగా ఉండాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

1. విటమిన్ ఏ : చర్మ కణాలు చక్కగా ఉండేలా చేస్తుంది. పొట్ట, శ్వాసనాళం పనిచేసేందుకు ఏ విటమిన్ తప్పనిసరి. సముద్ర చేపలు, గుడ్లు, వెన్న, బాదం, పిస్తా వంటి పప్పులు, గింజలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, క్యారట్, ఆకు కూరల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.

2. విటమిన్ బి: ఇది కొన్ని విటమిన్ల గ్రూపు. ఇవి బాడీలో నిల్వ ఉంటాయి. ముఖ్యంగా B6, B9, B12 విటమిన్లు శరీరంలో చేరిన సూక్ష్మక్రిములు, వైరస్ లాంటి వాటిని అంతచేస్తాయి. తృణధాన్యాలు, గింజలు, ఆకు కూరలు, పండ్లు, పప్పులు, చికెన్, మటన్, గుడ్లు, సోయా మిల్క్ వంటివి వాటిల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

3. విటమిన్ సి, ఈ : విటమిన్ సి, ఈ (C, E) విటమిన్లు కరోనా వైరస్‌ని ఎదుర్కొవడంలో తొడ్పాటునందిస్తాయి. ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే కమలాపండ్లు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, బెర్రీస్, కివి ఫ్రూట్, బ్రకోలీ, టమాటాలు, కాప్సికం, పప్పులు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. విటమిన్ డి : శరీరానికి కావాల్సిన ఎక్స్‌ట్రా ఎనర్జీగా విటమిన్ డి పనిచేస్తుంది. ఇంట్లో ఉన్నా, ఎండ తగిలేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం వరండాలో ఓ పావు గంట గడపాలి. అలాగే గుడ్లు, చేపలు, పాలు బాగా తీసుకోవాలి. తద్వారా వైరస్‌ని ఎదుర్కొగల శక్తి సామర్థ్యాలను మన శరీరానికి లభిస్తాయి.

5. ఐరన్, జింక్, సెలెనియం: కణాలు పెరగాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా, వైరస్‌తో పోరాడాలన్నా, ఐరన్, జింక్, సెలెనియం చాలా అవసరం. తృణధాన్యాల్లో ఇలాంటి శక్తి ఉంటుంది. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కస్తూరి ఆకులు, అల్లం, వెల్లుల్లి ఇలా వీలైనంత ఎక్కువగా వీటిని తీసుకోవాలి. ఇలాంటి పౌష్టికాహారం తీసుకుంటూ పలు రకాల వ్యాయమాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పరిశుభ్రత, పరిసరాల శుభ్రతను పాటించాలని వారు పేర్కొంటున్నారు.

ABCDE vitamin is an important part of combating corona

The post కరోనాను ఎదుర్కోవడంలో ఏబిసిడిఈ విటమిన్లదే ముఖ్యపాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: