గంభీర్ కు రెండు ఓటర్ ఐడిలు

Gautam Gambhirన్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇటీవలె బిజెపి తీర్థం పుచ్చుకుని ఈ లోక్ సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి కమలం ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గౌతీకి రెండు ఓట్లు ఉన్నాయని ఆప్ నేత ఆతిషి మార్లెనా ఆరోపించారు. అది కూడా ఒకే పట్టణంలో ఉన్నట్లు తెలుపుతూ గంభీర్ పై కోర్టుకెక్కారు. ఢిల్లీ కరోల్ బాగ్, రాజిందర్ నగర్ రెండు చోట్ల గౌతీకి ఓట్లు ఉన్నాయని… అవి రెండు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం కిందకు వస్తాయని ఆప్ నేతలు పేర్కొన్నారు. సెక్షన్ 17, సెక్షన్ 31 కింద గంభీర్ నేరం చేశాడని, ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు. గంభీర్ అపరాద్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. కాగా, ఈ ఆరోపణలపై గౌతం ఎలా స్పందిస్తారో చూడాలి.

AAP leader Atishi moves court against Gautam Gambhir

The post గంభీర్ కు రెండు ఓటర్ ఐడిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.