పాఠశాలకూ పాకిన ర్యాగింగ్ భూతం

మన తెలంగాణ/ఎల్‌బినగర్ : తోటి విద్యార్థులే ర్యాగింగ్‌కు పాల్పడగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించకపోవటంతో బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కర్మాన్‌ఘాట్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన రవికిరణ్ కర్మాన్‌ఘాట్‌లోని నియో రాయల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. రవికిరణ్‌తో పాటే చదువుకుంటున్న అఖిల్, శశాంక్ విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నాడు. ఇంటి నుండి డబ్బులు తెచ్చివ్వాలని రవికిరణ్‌ను తరచుగా వేధిస్తున్నారు. వీరి బాధను […] The post పాఠశాలకూ పాకిన ర్యాగింగ్ భూతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/ఎల్‌బినగర్ : తోటి విద్యార్థులే ర్యాగింగ్‌కు పాల్పడగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించకపోవటంతో బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కర్మాన్‌ఘాట్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. గ్రీన్‌పార్క్ కాలనీకి చెందిన రవికిరణ్ కర్మాన్‌ఘాట్‌లోని నియో రాయల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. రవికిరణ్‌తో పాటే చదువుకుంటున్న అఖిల్, శశాంక్ విద్యార్థులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నాడు. ఇంటి నుండి డబ్బులు తెచ్చివ్వాలని రవికిరణ్‌ను తరచుగా వేధిస్తున్నారు. వీరి బాధను భరించలేక రవికిరణ్ కొన్ని రోజుల కిందట ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా రూ.6 వేలు తీసుకొచ్చి అఖిల్‌కు ఇచ్చాడు. ఇది జరిగిన మరికొన్ని రోజుల తరువాత మరో వెయ్యి రూపాయలు తేవాలని అఖిల్, శశాంక్‌లు రవికిరణ్‌ను వేధిస్తున్నారు. దీనితో రవికిరణ్ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన రవికిరణ్ ఇటీవల పాఠశాల నుండి వచ్చి సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన ఇంట్లోని సభ్యులు వెంటనే అతన్ని కాపాడి చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుండి బయటపడిన రవికిరణ్ కోమాలో ఉన్నాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బిజెవైఎం నాయకులు అవినాశ్, ఇతరులు పాఠశాలకు వెళ్ళి యాజమాన్యాన్ని నిలదీయగా నిర్లక్షంగా సమాధానం ఇవ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే పాఠశాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా రవికిరణ్ తండ్రి వెంకట్‌రావు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు స్కూల్‌కు వచ్చి దర్యాప్తు చేపట్టారు.

A Raging In  School Boy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాఠశాలకూ పాకిన ర్యాగింగ్ భూతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.